ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా(PC: IPL/BCCi)
IPL 2022 MI Vs KKR- Bumrah Comments: టీమిండియా స్టార్ పేసర్, ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్-2022లో స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. ఆడిన 10 మ్యాచ్‌లలో అతడు పడగొట్టిన వికెట్ల సంఖ్య కేవలం 5. దీంతో బుమ్రా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘నీ నుంచి ఇది ఊహించలేదంటూ’’ కామెంట్లు వినిపించాయి. అయితే ఇదంతా మొన్నటి ముచ్చట.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌తో తన విలువేంటో చాటుకున్నాడు బుమ్రా. ఉత్తమ గణాంకాలు నమోదు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా బుమ్రా చెలరేగిన విధానం అభిమానుల్లో జోష్ నింపింది. ‘‘పేస్ బాస్ ఈజ్ బ్యాక్’’ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విమర్శలను తాను ఏనాడు అసలు లెక్కచేయనని పేర్కొన్నాడు. ‘‘ టోర్నమెంట్‌కు మేము పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. ఫలితం ఏమిటన్నది తర్వాత విషయం. ఆడే విధానంపై అవగాహన ఉంటే సాఫీగా ముందుకు సాగిపోవచ్చు. పరిస్థితులను అర్థం చేసుకుని.. అందుకు తగ్గట్లు బౌలింగ్ చేయాలి.
నా వరకైతే నేను నా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నాను. బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారని తెలుసు. అయితే, ఇతరులు ఏమనుకుంటున్నారన్న విషయం గురించి ఆలోచిస్తూ నన్ను నా ఆటను జడ్జ్ చేసుకునే మనిషిని కాదు నేను. వాళ్ల మాటలు నన్ను ప్రభావితం చేయలేవు’’ అంటూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు.
ఐపీఎల్ మ్యాచ్ 56: ముంబై వర్సెస్ కేకేఆర్
టాస్- ముంబై
కేకేఆర్- 165/9 (20)
ముంబై- 113 (17.3)
విజేత: కేకేఆర్(52 పరుగుల తేడాతో గెలుపు)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్‌ప్రీత్ బుమ్రా
చదవండి👉🏾Rohit Sharma: బుమ్రా స్పెషల్.. అది ముందే తెలుసు.. అయినా చెత్త ప్రదర్శన.. అంతా వాళ్లే చేశారు!
చదవండి👉🏾Rovman Powell: 'మూడురోజులు టవల్ చుట్టుకునే.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు'
That's that from Match 56.@KKRiders take this home comfortably with a 52-run win over #MumbaiIndians
— IndianPremierLeague (@IPL) May 9, 2022
Scorecard - https://t.co/eXsU8yDmge #MIvKKR #TATAIPL pic.twitter.com/3gu0ZsHYH6
Comments
Please login to add a commentAdd a comment