Angkrish Raghuvanshi
-
సైనా నెహ్వాల్‌కు సారీ చెప్పిన కేకేఆర్ స్టార్.. అసలేం జరిగిందంటే?
కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను రఘువంశీ అవహేళన చేయడమే ఇందుకు కారణం. అయితే తన తప్పు తెలుసుకున్న ఈ యువ క్రికెటర్.. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు కూడా తెలిపాడు.అసలేం జరిగిందంటే..?బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు శారీరకంగా చాలా కష్టమైనవని, కానీ అభిమానులు మాత్రం ఇతర క్రీడల కంటే క్రికెట్‌కే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని సైనా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యనించింది."సైనా ఏం చేస్తుందో, రెజ్లర్లు, బాక్సర్లు, నీరజ్ చోప్రా ఏం చేస్తున్నారని అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రీడాకారుల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. ఎందుకంటే మేము మేము మంచి ప్రదర్శనలు కనబరిచి తరచుగా వార్తాపత్రికలలో వస్తుంటాం. మా లాంటి క్రీడాకారుల వల్ల భారత్‌కు గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కానీ మన దేశంలో మాత్రం క్రీడా సంస్కృతి పెద్దగా లేదు. అందరి దృష్టి క్రికెట్‌పైనే ఉంటోందని కొన్నిసార్లు బాధేస్తుంది. క్రికెట్‌కు మిగితా క్రీడలకు చాలా తేడా ఉంది. క్రికెట్‌తో పోలిస్తే బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, ఇతర క్రీడలు శారీరకంగా చాలా కఠినమైనవి. షటిల్ తీసుకొని సర్వ్ చేసేంత సమయం కూడా ఉండదు. అతి కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. కానీ క్రికెట్లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. అయినప్పటకి క్రికెట్టే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుందని" అని నిఖిల్ సింహా పోడ్కాస్ట్లో సైనా నెహ్వాల్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సైనా వ్యాఖ్యలపై స్పందించిన రఘువంశీ వివాదస్పద ట్వీట్(ఎక్స్) చేశాడు. ‘‘బుమ్రా 150 కి.మీ వేగంతో ఆమె తలపైకి బౌన్సర్ బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం’’ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. వెంటనే తన తప్పును గ్రహించిన రఘువంశీ తన చేసిన పోస్ట్‌ను డిలీట్ చేశాడు. ఆమె సారీ చెబుతూ మరో పోస్ట్ చేశాడు.అందరూ నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలను సరదగా తీసుకుంటారు అనుకున్న. కానీ తర్వాత ఆలోచిస్తే ఆర్ధంలేని జోక్‌లా అన్పించింది. నేను నా తప్పును గ్రహించాను. అందుకే హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుతున్నానని ఎక్స్‌లో రఘువంశీ మరో పోస్ట్ చేశాడు. కాగా 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన రఘువంశీ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 10 ఇన్నింగ్స్ ఆడి.. 115.24 స్ట్రైక్ రేట్‌తో 163 పరుగులు చేశాడు. Saina Nehwal Stoodup and Spoken Some Harsh Facts 🔥 pic.twitter.com/gaF9fSROXc— Gems of Shorts (@Warlock_Shabby) July 11, 2024 -
నా గురువు.. సర్వస్వం: టీమిండియా మాజీ క్రికెటర్ వల్లే ‘హీరో’గా!
‘‘ప్రతీ విషయంలోనూ ఆయన నాకు సహాయం అందించారు. మ్యాచ్ ఆడేటపుడు నేను ఆలోచించే విధానంపై ఆయన ప్రభావం ఉంటుంది. గేమ్‌లో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఆయన వల్లే నాకు స్పష్టత వచ్చింది. అంతేకాదు.. ఎలాంటి ఫుడ్ తినాలి? ఎలాంటి శిక్షణ తీసుకోవాలి? అన్నవి కూడా ఆయన నిర్ణయాలకు అనుగుణంగానే సాగుతాయి. ఆయన నా గురువు. నా సర్వస్వం. ఆయనతో నాకున్న అనుబంధం ఇదే’’ అంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ యువ సంచలనం అంగ్క్రిష్ రఘువంశీ ఉద్వేగానికి లోనయ్యాడు. తనను క్రికెటర్‌గా తీర్చిదిద్దిన కోచ్ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో తన తొలి ఇన్నింగ్స్ ఆడాడు అంగ్క్రిష్. మెరుపు అర్ధ శతకంతో కేకేఆర్ తరఫున వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మెరుపు అర్ధ శతకం(27 బంతుల్లో 54)తో అలరించాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే తనదైన ముద్ర వేసి ‘హీరో’ అనిపించుకున్నాడు. ఢిల్లీపై కేకేఆర్ 106 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం 18 ఏళ్ల అంగ్క్రిష్ రఘువంశీ మాట్లాడుతూ.. తన ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. గత కొన్ని వారాలుగా తాను కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నానన్న అతడు.. ఢిల్లీతో మ్యాచ్‌లో తనకు అదే ఉపకరించిందని పేర్కొన్నాడు. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఇక తన కోచ్ గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురైన అంగ్క్రిష్.. ఆయనే తన సర్వస్వం అని పేర్కొన్నాడు. చిన్నానాటి నుంచి తన దగ్గర నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. ఇంతకీ అంగ్క్రిష్ గురువు ఎవరంటే...?! అభిషేక్ నాయర్. ఈ మెరుపులకు ఒక రకంగా మనోడే కారణం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జన్మించిన అభిషేక్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు. 2009, జూలైలో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే, మీడియం పేస్ ఆల్‌రౌండర్ టీమిండియాలో నిలదొక్కుకోలేకపోయాడు. అదే ఏడాది సెప్టెంబరులో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. భారత్ తరఫున మొత్తం మూడు వన్డేలు ఆడి ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా అంగ్క్రిష్ రఘువంశీ ఢిల్లీలో జన్మించాడు. అయితే, పదకొండేళ్ల వయసులోనే ముంబైకి వెళ్లగా.. అక్కడ అభిషేక్ నాయర్ శిక్షణలో క్రికెటర్‌గా ఓనమాలు దిద్ది.. ఈస్థాయికి చేరాడు. ఇక అంగ్క్రిష్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2024: వాళ్లకు రిషభ్ పంత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వచ్చీరాగానే ఇరగదీశాడు.. ఎవరీ అంగ్క్రిష్ రఘువంశీ?
IPL 2024: Who Is Angkrish Raghuvanshi?: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మరో ప్రతిభావంతుడైన క్రికెటర్ వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికే ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్ పోరెల్ సత్తా చాటగా.. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మయాంక్ యాదవ్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. తన స్పీడ్ పవర్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు ఈ 21 ఏళ్ల రైటార్మ్ పేసర్. ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్- కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో మరో యువ సంచలనం తెర మీదకు వచ్చాడు. విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ విశాఖ సాగర తీరాన పరుగుల సునామీ సృష్టించి తన ఆగమాన్ని ఘనంగా చాటాడు. అతడే అంగ్క్రిష్ రఘువంశీ. జూన్ 5, 2005లో.. ఢిల్లీలో జన్మించాడు ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అండర్ 19 వరల్డ్‌కప్-2023 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. Raghuvanshi Ji ke ang ang mein talent hai 🤌#DCvKKR #TATAIPL #IPLonJioCinema #TATAIPLinBhojpuri pic.twitter.com/YKUIw577kD — JioCinema (@JioCinema) April 3, 2024 యశ్ ధుల్ సారథ్యంలో యంగ్ ఇండియాకు ఆడి ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీలో 278 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన అంగ్క్రిష్ రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చి దుమ్ములేపాడు ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా అంగ్క్రిష్ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టాడు. అయితే, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడికి అవకాశం వచ్చింది. ఇక డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ చేసే దక్కించుకున్న అంగ్క్రిష్.. వన్‌డౌన్‌లో వచ్చి ఇరగదీశాడు. నరైన్ ఊచకోత.. అంగ్క్రిష్ విధ్వంసం ఓవైపు సునిల్ నరైన్(39 బంతుల్లో 85) ఢిల్లీ బౌలింగ్‌ను ఊచకోత కోస్తుంటే.. అతడికి తోడుగా మరోవైపు అంగ్క్రిష్ కూడా దుమ్ములేపే ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 54 పరుగులు రాబట్టాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అతి పిన్న వయసులో అర్ధ శతకం సాధించిన ఏడో ఆటగాడిగా నిలిచాడు. 18 ఏళ్ల 303 రోజుల వయసులో అంగ్క్రిష్ ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే యాభై కంటే ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 23వ స్థానం సంపాదించాడు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడుతూ.. ఢిల్లీకి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ పదకొండేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. చిన్ననాటి కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ సాయంతో అంచెలంచెలుగా ఎదిగి ముంబై జట్టుకు ఆడే స్థాయికి చేరాడు. 2023లో ముంబై తరఫున లిస్ట్ ఏ, టీ20లలో అరంగేట్రం చేశాడు. సీకే నాయుడు ట్రోఫీ(ఫస్ట్ క్లాస్ క్రికెట్)లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 765 పరుగులతో సత్తా చాటాడు. ఇక కేకేఆర్ తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన అంగ్క్రిష్ రఘువంశీ ఇదే జోరు కొనసాగిస్తే సహచర ఆటగాడు రింకూ మాదిరి.. త్వరలోనే టీమిండియాలోనూ అడుగుపెట్టే అవకాశం దక్కించుకోగలడు. ఆల్ ది బెస్ట్ అంగ్క్రిష్ రఘువంశీ!! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024