
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఓటిస్ గిబ్సన్‌ను సహాయక కోచ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా... వెస్టిండీస్ మాజీ పేసర్ గిబ్సన్ కేకేఆర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 650కి పైగా వికెట్లు పడగొట్టిన 55 ఏళ్ల గిబ్సన్... 1995 నుంచి 99 మధ్య వెస్టిండీస్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం కోచింగ్ వైపు మళ్లిన గిబ్సన్... ఇంగ్లండ్ జాతీయ జట్టుకు రెండు పర్యాయాలు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.
2010–14 మధ్య వెస్టిండీస్ హెడ్ కోచ్‌గా, 2017–19 మధ్య దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన గిబ్సన్ అనుభవం తమ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ భావిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతా జట్టుకు చంద్రకాంత్ పండిత్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా... బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కార్ల్ క్రో పనిచేస్తున్నారు. గంభీర్ అనంతరం వెస్టిండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రేవో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment