
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ వీరోచితంగా పోరాడి సెంచరీ చేశాడు. 26 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన లిటన్ దాస్.. 228 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేసి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు.
దాస్.. మెహిది హసన్ మిరజ్‌తో (78) కలిసి ఏడో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. దాస్, మిరజ్ వీరోచితంగా పోరాడటంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌కు ధీటుగా జవాబిచ్చింది.
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ 12 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. పాక్ పేసర్ ఖుర్రమ్ షెహజాద్ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించగా.. మీర్ హమ్జా, అఘా సల్మాన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్, మిరజ్‌తో పాటు షద్మాన్ ఇస్లాం (10), హసన్ మహమూద్ (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బ్యాట్‌తో రాణించిన మిరజ్ బంతితోనూ (5/61) చెలరేగాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నిహద్ రాణా, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment