
బంగ్లాతో మొదటి వన్డేలో రోహిత్ సేన
India tour of Bangladesh, 2022 - Bangladesh vs India, 2nd ODI- మిర్పూర్: ఏడేళ్ల క్రితం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు 1–2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ధోని నాయకత్వంలో నాడు తొలి రెండు వన్డేల్లోనే ఓడిన తర్వాత చివరి మ్యాచ్‌లో నెగ్గి పరువు దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి మన జట్ట దాదాపు అలాంటి స్థితినే ఎదుర్కొంటోంది.
ఆదివారం అనూహ్యంగా మొదటి మ్యాచ్‌లో ఓడిన రోహిత్ శర్మ బృందం సిరీస్ చేజారకుండా ఉండాలంటే తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో వన్డేలో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది.
పిచ్, వాతావరణం
ఈ మ్యాచ్ కూడా గత వన్డే జరిగిన వేదికపైనే జరగనుంది. పిచ్ అటు బౌలింగ్‌కు, ఇటు బ్యాటింగ్‌కు కూడా అనుకూలిస్తూ సమతూకంగా ఉంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే!
►ఉదయం గం.11.30 గంటలకు ఆరంభం
►సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
తుది జట్లు అంచనా
భారత్
ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అక్షర్ పటేల్ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉన్నట్లయితే.. బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేసే క్రమంలో అక్షర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. యువ స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో అతడు వచ్చే ఛాన్స్ ఉంది.
జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్/అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్.
బంగ్లాదేశ్:
ఎటువంటి మార్పులు లేకుండా మొదటి వన్డేలో ఆడిన జట్టుతోనే బంగ్లా బరిలోకి దిగే అవకాశం ఉంది.
జట్టు: లిటన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఇబాదత్ హుస్సేన్.
చదవండి: FIFA WC Pre- Quarterfinals: స్పెయిన్‌కు షాక్.. మొరాకో సంచలనం! బోనో వల్లే ఇదంతా!
Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్