T20 World Cup 2022: Virat Kohli Gift Bat To Litton Das For India Vs Bangladesh Match - Sakshi
Sakshi News home page

T20 WC 2022: టీమిండియాతో మ్యాచ్‌లో అదరగొట్టాడు.. లిటన్‌ దాస్‌కు కోహ్లి అదిరిపోయే గిఫ్ట్‌

Published Fri, Nov 4 2022 9:03 AM | Last Updated on Fri, Nov 4 2022 10:15 AM

Virat Kohli gifts a bat to Litton Das after India vs Bangladesh match - Sakshi

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నవంబర్‌ 3న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ ఆడిన ఇన్నింగ్స్‌ మాత్రం మ్యాచ్‌ మొత్తానికే హైలట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లకు దాస్‌ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డ దాస్‌..27 బంతుల్లో 7 ఫోర్లు,  మూడు సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు.

కేవలం 21 బంతుల్లోనే దాస్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అఖరి రనౌట్‌ రూపంలో దాస్‌ పెవిలియన్‌కు చేరడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు మలుపు తిరిగింది. ఇక ఇది ఇలా ఉండగా.. అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన లిటన్‌ దాస్‌కు భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన బ్యాట్‌న బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనస్ వెల్లడించారు.

"మేము డైనింగ్ హాల్‌లో ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీ వచ్చి లిటన్‌కు తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది నిజంగా లిటన్‌కు మధురమైన క్షణం" అని జలాల్ యూనస్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 64 పరుగులు చేసిన కోహ్లికి.. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది.
చదవండి: కోహ్లి "ఫేక్‌ ఫీల్డింగ్‌" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement