కోహ్లి మరో 152 పరుగులు చేస్తే..? | IND VS BAN 1st Test: Virat Kohli Just 152 Runs Away To Complete 9000 Runs In Test Cricket | Sakshi
Sakshi News home page

కోహ్లి మరో 152 పరుగులు చేస్తే..?

Published Tue, Sep 17 2024 9:33 AM | Last Updated on Tue, Sep 17 2024 10:10 AM

IND VS BAN 1st Test: Virat Kohli Just 152 Runs Away To Complete 9000 Runs In Test Cricket

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌ చెన్నై వేదికగా జరుగనుంది. రెండో మ్యాచ్‌ కాన్పూర్‌ వేదికగా సెప్టెంబర్‌ 27న ప్రారంభం కానుంది.

తొలి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రెండు భారీ రికార్డులపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ మరో 152 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో 9000 పరుగుల మైలురాయిని తాకుతాడు. టెస్ట్‌ల్లో ఇప్పటివరకు కేవలం​ 17 మంది మాత్రమే  9000 పరుగుల మార్కును తాకారు. ప్రస్తుతం విరాట్‌ 113 టెస్ట్‌ల్లో 8848 పరుగులు చేశాడు.

తొలి టెస్ట్‌లో విరాట్‌ మరో 58 పరుగులు చేస్తే సచిన్‌ పేరిట ఉన్న ఫాస్టెస్ట్‌ 27000 రన్స్‌ రికార్డును (అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో) బద్దలు కొడతాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 27000 పరుగుల మార్కును అందుకునేందుకు సచిన్‌కు 623 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. విరాట్‌కు 594 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. విరాట్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 593 ఇన్నింగ్స్‌లు ఆడి 26942 పరుగులు  చేశాడు.

సచిన్‌ ఓవరాల్‌గా 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే 27000 పరుగుల మార్కును అందుకున్నారు.

వీరిలో సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా.. సంగక్కర (28016), రికీ పాంటింగ్‌ (27483) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో విరాట్‌ మరో 58 పరుగులు చేస్తే ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌ అవుతాడు.

తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సర్ఫరాజ్‌ ఖాన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, ధృవ్‌ జురెల్‌, రిషబ్‌ పంత్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌దీప్‌, యశ్‌ దయాల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

చదవండి: బంగ్లాతో తొలి టెస్టు.. కోహ్లికి చుక్కలు చూపించిన బుమ్రా

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement