బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌తో బిజీబిజీగా గడుపుతుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా ట్రైనింగ్ క్యాంప్ సెప్టెంబర్ 13న మొదలైంది. మూడు రోజుల నుంచి భారత ఆటగాళ్లు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ (దులీప్ ట్రోఫీ ఆడుతున్నాడు) మినహా జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
కెప్టెన్ రోహిత్ తన ఫేవరెట్ పుల్ షాట్‌తో పాటు రివర్స్ స్వీప్ షాట్స్ ప్రాక్టీస్ చేయగా.. కోహ్లి, శుభ్‌మన్, యశస్వి, కేఎల్ రాహుల్, పంత్ తమ బ్యాటింగ్ టాలెంట్‌కు పదును పెట్టారు. బ్యాటర్లంతా ఎక్కువ సేపు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఈ సెషన్స్‌లో భారత లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు (కుల్దీప్, అశ్విన్, జడేజా) కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. సిరాజ్, బుమ్రా, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్ ఫుల్ టైమ్ బంతులతో సాధన చేశారు.
గోడ బద్దలు కొట్టిన విరాట్
ప్రాక్టీస్‌లో విరాట్ అందరికంటే చాలా ఎక్కువ సమయం గడిపాడు. అశ్విన్‌ను ఎదుర్కోవడంతో ప్రాక్టీస్‌ను మొదలుపెట్టిన విరాట్.. ఆల్టర్నేట్ పద్దతిలో స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ప్రాక్టీస్ చేసే క్రమంలో విరాట్ ఓ బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. విరాట్ సిక్సర్ దెబ్బకు డ్రెస్సింగ్ రూమ్ గోడ బద్దలైంది. గోడ బద్దలైన ఫోటోను బీసీసీఐ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. విరాట్ ఇదే జోరును కొనసాగిస్తే.. తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌కు తిప్పలు తప్పవని అభిమానులు అంటున్నారు.
కాగా, బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న మొదలవుతుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి. టీమిండియాతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. టీమిండియా మాత్రం తొలి టెస్ట్‌కు మాత్రమే జట్టును ప్రకటించింది.
టీమిండియాతో టెస్ట్ సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు..
నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, మొమినుల్ హక్, షకీబ్ అల్ హసన్, మెహిది హసన్ మీరజ్, ముష్ఫికర్ రహీం, లిట్టన్ దాస్, జాకిర్ అలీ, జాకిర్ హసన్, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్, నహిద్ రాణా, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్
తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment