
ఢాకా : బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలి లిటన్ దాస్ భార్య దేవశ్రీ బిశ్వాస్ సంచిత(27)కి గాయాలయ్యాయి. టీ పెట్టేందుకని వంట గదిలోకి వెళ్లిన ఆమె గ్యాస్ స్టవ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ముఖాన్ని రక్షించుకునే క్రమంలో చేతులకు గాయాలయ్యాయని కుటుంబసభ్యులు తెలిపారు. పేలుడు ధాటికి కిచెన్ కేబినెట్ కూలి ఆమెపై పడడంతో కాళ్లకి, ముఖానికి కూడా గాయాలయ్యాయి.
కాగా.. రెండు రోజుల క్రితమే ఈ ఘటన జరగినా ఆమె ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగు చూసింది. ‘చావు దగ్గర వరకు వెళ్లి తప్పించుకున్నా. చేతులు అడ్డు పెట్టకుండా ఉంటే ముఖమంతా కాలి పోయేది. వంట గదిలో గ్యాస్ సిలిండర్ ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించండి’ అని సంచిత తెలిపారు. 2019లో ప్రపంచకప్ తర్వాత లిటన్ దాస్, దేవశ్రీల వివాహం జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment