బంగ్లాదేశ్ జట్టు (PC: Bangladesh Cricket Twitter)
Bangladesh vs Ireland, 2nd T20I: ‘‘అత్యంత వేగంగా 50 పరుగుల మార్కును అందుకున్నందుకు సంతోషంగా ఉంది. అయితే, నేనెప్పుడూ రికార్డుల గురించి ఆలోచించను. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై త్వరత్వరగా పరుగులు రాబట్టుకోవాలని మాత్రమే అనుకున్నా’’ అని బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ అన్నాడు.
ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన రెండో టీ20లో లిటన్ దాస్ ఫాస్టెస్ ఫిఫ్టీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఐరిష్ ఆటగాళ్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో 16 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు.
అదరగొట్టారు.. రోనీ ఏం తక్కువ కాదు..
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 202కు పైగా స్ట్రైక్‌రేటుతో 83 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోనీ తాలూక్దార్(23 బంతుల్లో 44 పరుగులు)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
వీరిద్దరు కలిసి పవర్‌ప్లేలో 73 పరుగులు సాధించారు. తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నమెదు చేశారు. వర్షం అడ్డంకి కారణంగా 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ 202 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తడబడింది.
ప్రతిసారీ పవర్‌ప్లేలో 70-80 అంటే
బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఐదు వికెట్లు తీసి.. ఐరిష్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. దీంతో 77 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఓటమిపాలు కాగా.. సిరీస్ 2-0తో బంగ్లా సొంతమైంది. ఈ నేపథ్యంలో లిటన్ దాస్ మాట్లాడుతూ.. ‘‘మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తప్పకుండా విజయాలు వరిస్తాయి.
ఇంతకంటే బాగా ఆడాలంటే కాస్త కష్టమే. ఎందుకంటే ప్రతిసారి పవర్‌ప్లేలో 70-80 పరుగులు రాబట్టలేము కదా! ఒకవేళ ఇదే జోరు కొనసాగితే మాత్రం మాకంటే సంతోషించే వాళ్లు ఎవరుంటారు?
గత రెండు మ్యాచ్‌లలో అత్యుత్తమంగా రాణించాం. అందుకే వరుస విజయాలు సాధ్యమయ్యాయి. ఇదే జోష్‌ను కొనసాగిస్తూ ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో షకీబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్- ఐర్లాండ్ మధ్య నామమాత్రపు మూడో టీ20 శుక్రవారం (మార్చి 31) జరుగనుంది.
చదవండి: IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ దూరం! కెప్టెన్‌గా సూర్యకుమార్
Comments
Please login to add a commentAdd a comment