![IPL 2021: Mohammed Shami Reveals Will Teach Punjabi To Chris Gayle - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/16/Gayle.jpg.webp?itok=Jvt6hMjd)
Courtesy: IPL Twitter
ముంబై: యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరుకే కరీబియన్ అయినా భారత్‌తో అనుబంధం మాత్రం ఎప్పటినుంచో కొనసాగుతుంది. ఐపీఎల్ సీజన్ ఆరంభమైన నాటి నుంచి ప్రతీ సీజన్‌లో ఆడుతూ వస్తున్న గేల్ ఇండియా అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. తన విధ్వంసకర ఆటతీరుతో క్షణాల్లో మ్యాచ్‌లను మార్చివేసే గేల్‌కు భారత్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 40 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. నేడు సీఎస్‌కేతో జరగనున్న మ్యాచ్‌కు సన్నద్దమవుతున్నగేల్ గురించి ఆ జట్టు ఆటగాడు మహ్మద్ షమీ ఫన్నీ కామెంట్స్ చేశాడు.
''గేల్ కరీబియన్ నుంచి వచ్చినా.. ఇండియాకు ఎప్పుడో దగ్గరయ్యాడు. అతను భారతీయ సంస్కృతి, సంస్కారాన్ని గౌరవిస్తాడు.. అంతేకాదు హిందీలో మాట్లాడడానికి గేల్ చాలా ఇష్టపడతాడు.. మాతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్‌లో ఆరంభించినా.. సడెన్‌గా హిందీలోకి మారిపోతాడు. ఇప్పుడిక పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్నాడు కాబట్టి గేల్ పంజాబీ కూడా నేర్పాల్సి ఉంటుందేమో.. సీజన్ అయిపోయేలోపు మా జట్టు ఆటగాళ్లమంతా కలసి ఎలాగైనా గేల్‌కు పంజాబీ నేర్పిస్తాం'' అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 133 మ్యాచ్‌లాడి 4812 పరుగులు సాధించాడు.
చదవండి: క్యాచ్ పట్టినప్పుడల్లా తొడగొట్టావు.. మ్యాచ్ తర్వాత నీ పరిస్థితి
పంత్ రనౌట్.. పరాగ్ డ్యాన్స్.. వీడియో వైరల్
అమ్మాయిలతో గేల్ చిందులు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment