![IPL 2021: Chris Gayle Dance With Bikini Girls Becomes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/11/Gayle.jpg.webp?itok=xHm78HrM)
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ సందర్భంగా యునివర్సల్ బాస్, పంజాబ్ కింగ్స్ స్టార్ క్రిస్ గేల్ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే క్వారంటైన్ పూర్తి చేసుకున్న గేల్ ప్రాక్టీస్‌తో పాటు వరుస ప్రమోషనల్ వీడియోలతో రెచ్చిపోతున్నాడు. మొన్న మైకెల్ జాక్సన్ మూన్‌వాక్ స్టెప్స్‌తో ఇరగదీసిన యునివర్సల్ బాస్.. నిన్న పంజాబీ స్టార్ దలేర్ మెహందీ పాటకు డోలు వాయిస్తూ రిలీజ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా గేల్ మరో కొత్త రకం మ్యూజిక్ వీడియోతో ముందుకొచ్చాడు. ప్రముఖ ఇండియన్ ర్యాపర్ ఎమివే బాంటాయ్‌తో కలిసి అతడు ఈ మ్యూజిక్ వీడియో చేశాడు. కాగా ఈ వీడియోలో పలువురు యువతులు బికినీ ధరించి డ్యాన్స్ చేస్తుండగా గేల్ పాట పాడుతూ బాంటాయ్‌తో కలిసి చిందులేశాడు.
ఈ సందర్భంగా గేల్ తనలోని ర్యాప్ సింగింగ్ టాలెంట్‌ను బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను గేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం అది ట్రెండింగ్ లిస్టులో చేరింది. '' జమైకా టు ఇండియా అవుట్ నౌ'' అని కామెంట్ చేశాడు. కాగా గతేడాది ఐపీఎల్ సీజన్‌లో గేల్ పంజాబ్ కింగ్స్ తరపున తొలి అంచె పోటీలకు దూరమైనా.. రెండో అంచె పోటీల్లో మాత్రం ఇరగదీశాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనే 288 పరుగులు సాధించాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment