
వెస్టిండీస్ స్టార్.. యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌కు గేల్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్‌లో మధ్యలోనే వైదొలిగిన గేల్.. సుధీర్ఘకాలం బయోబబుల్‌లో ఉండలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా ఈసారి మెగావేలంలో గేల్ పాల్గొనలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తానని ఇటీవలే పేర్కొన్నాడు.
తాజాగా ఐపీఎల్ 2022కు దూరంగా ఉండడం వెనుక గేల్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో తనకు సముచిత గౌరవం లభించలేదని ఆరోపించాడు. ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ.. ''గత రెండేళ్లుగా ఐపీఎల్ లో నాతో వ్యవహరించిన తీరు సరిగా లేదు. ఐపీఎల్‌లో ఎన్నో ఘనతలు అందుకున్న తర్వాత కూడా దక్కాల్సిన గౌరవం దక్కకపోవడంతో బాధ కలిగింది. అయితే క్రికెట్ తర్వాత కూడా మనకు జీవితం ఉంటుంది.. అందుకే ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనుకున్నా. ఎవరిని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేకనే వేలంలోనూ పాల్గొనలేదు.
అయితే వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడే అవకాశం ఉంది. ఏ జట్టుకు ఆడుతానో తెలియదు కానీ.. నా అవసరం సదరు జట్టుకు కచ్చితంగా ఉంటుంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, కోల్‌కతా, పంజాబ్‌లకు ఆడినప్పటికి.. ఆర్సీబీ, పంజాబ్‌కు ఆడినప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ఆర్సీబీతో నా అనుబంధం చాలా గట్టిది. ఆ జట్టుకు టైటిల్ అందించలేకపోవడం కాస్త బాధ కలిగించింది. కానీ ఐపీఎల్‌లో నా అత్యధిక స్కోరు ఆ జట్టు తరపునే సాధించడం సంతోషం కలిగించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్‌లో గేల్ ట్రాక్ రికార్డు మాములుగా లేదు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లు ఆడిన గేల్ 149 స్ట్రైక్‌రేట్‌తో 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఆరు సెంచరీలు కొట్టిన ఆటగాడు గేల్ తప్ప మరొకరు లేదు. మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు గేల్ పేరిటే ఉంది. ఆర్‌సీబీ తరపున 2013లో పుణే వారియర్స్‌పై గేల్ ఆడిన 175 పరుగులు నాకౌట్ ఇన్నింగ్స్ ఇప్పటికి చెక్కుచెదరలేదు.
చదవండి: Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు?
Comments
Please login to add a commentAdd a comment