
జమైకా: విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ న్యూలుక్‌తో తన ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. తలపాగా చుట్టిన గేల్ కొత్త అవతారంలో మెరిసిపోతున్నాడు. విషయంలోకి వెళితే.. గేల్ ఈ మధ్యన ప్రైవేట్ ఆల్బమ్స్‌లో పాల్గొంటూ దానికి తగ్గట్టుగా తన డ్రెస్సింగ్, లుక్స్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా ఒక షూట్‌కు సంబంధించి గేల్ తలపాగా చుట్టుకుంటున్న వీడియోను షేర్ చేశాడు. ''రేపు జరగబోయే షూట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.. ఈ పంజాబీ డాడీ ఫైర్ మీద ఉన్నాడు.. ఎవరు ఆపాలన్నా ఆగను.. నా షూట్ కోసం ఎదురుచూడండి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
గేల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ''గేల్.. నీ లుక్ అదుర్స్'' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 14వ సీజన్ రద్దు కావడంతో గేల్ ఇటీవలే మాల్దీవ్స్‌లో సముద్రంలో జెట్‌తో షికారు చేసిన వీడియోలు రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేశాడు. దీంతోపాటు గేల్ ఇటీవలే తాను కొన్న కొత్త కారును ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. నీ దగ్గర ఉన్న కారు నా దగ్గర కూడా ఉందని.. కొంపదీసి నా కారు పట్టుకుపోలేదుగా అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.
గేల్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ తరపున ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన గేల్ 178 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్ ఆస్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూలై 9 నుంచి 24 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. గేల్ ఆసీస్‌తో సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక గేల్ విండీస్ తరపున ఇప్పటివరకు 103 టెస్టుల్లో 7214 పరుగులు, 301 వన్డేల్లో 10480 పరుగులు, 61 టీ20ల్లో 1656 పరుగులు చేశాడు.
చదవండి: ధనశ్రీ వర్మ డ్యాన్స్.. చాటుగా ఎంజాయ్ చేసిన చహల్
Comments
Please login to add a commentAdd a comment