నేను రేపు పాకిస్తాన్‌ వెళ్తున్నా.. ఇంతకీ ఐపీఎల్‌ ఆడుతున్నావా? లేదా? | Chris Gayle Tweet Confuses Fans Amid Pak Vs NZ Series Cancellation | Sakshi
Sakshi News home page

Chris Gayle: రేపు పాకిస్తాన్‌ వెళ్తున్నా.. నువ్వు ఐపీఎల్‌ ఆడటం లేదా?

Published Sun, Sep 19 2021 6:21 PM | Last Updated on Sun, Sep 19 2021 7:09 PM

Chris Gayle Tweet Confuses Fans Amid Pak Vs NZ Series Cancellation - Sakshi

Photo Courtesy: Punjab Kings

Chris Gayle Tweet Goes Viral: కేవలం ఆటతోనే కాదు.. తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటాడు యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌. విషయం ఏదైనా సరే.. ఈ సిక్సర్ల కింగ్‌ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకుంటాడు. అయితే, ఆదివారం అతడు చేసిన ఓ ట్వీట్‌ మాత్రం మిస్‌ఫైర్‌ అయినట్లుగా కనిపిస్తోంది. జోకులు వేయడానికి సమయం, సందర్భం లేదా అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. కాగా కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నేటి నుంచి పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్‌ గేల్‌ యూఏఈ చేరుకున్నాడు. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని జట్టుతో చేరాడు. ఇదిలా ఉండగా... భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్‌ రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పాకిస్తాన్‌ మాజీలు మండిపడుతుండగా.. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కివీస్‌ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో క్రిస్‌ గేల్‌ చేసిన ట్వీట్‌ అభిమానులను గందరగోళానికి గురి చేసింది. ‘‘నేను రేపు పాకిస్తాన్‌కు వెళ్తున్నాను. నాతో ఎవరెవరు వస్తారు’’ అని అతడు అడిగాడు. ఇందుకు ఓ వర్గం సంతోషం వ్యక్తం చేయగా... కొంతమంది నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘‘ఇంతకీ నువ్వు ఐపీఎల్‌ ఆడుతున్నావా లేదా?.. అయినా ఒక మనిషి ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల ఎలా ఉండగలడు. నీ మాటలకు అసలు అర్థమేమిటి?’’ అని క్రిస్‌ గేల్‌ తీరును విమర్శిస్తున్నారు.

ఇంకొంత మంది.. సీరియస్‌ అంశాలను కూడా ఇలా జోక్‌ చేయడం తగునా అంటూ అతడి తీరును తప్పుపడుతున్నారు.  కాగా ఐపీఎల్‌ గేల్‌ విజయవంతమైన ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకు అతడు 140 మ్యాచ్‌లు ఆడి 4950 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇక పొట్టి ఫార్మాట్‌లో గేల్‌ సిక్సర్ల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

చదవండి: Shoaib Akhtar: డేట్‌ గుర్తుపెట్టుకోండి.. దెబ్బకు దెబ్బ తీయాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement