Chris Gayle leaves Bio Bubble: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున మిగిలిన మ్యాచ్‌లనుంచి తప్పుకుంటున్నట్లు క్రిస్ గేల్ ప్రకటించాడు. సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటూ రావడంతో మానసికంగా బాగా అలసిపోయానన్న గేల్.. టి20 ప్రపంచకప్‌లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు విరామం కోరుకుంటున్నానని అతను వెల్లడించాడు. ఈ మేరకు... ‘‘గత కొన్ని నెలలుగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ బబుల్.. ఆ తర్వాత ఐపీఎల్ బబుల్‌లో ఉంటున్నాను. మానసిక పునరుత్తేజాన్నిపొందడానికి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని పేర్కొన్నాడు.
ఇక ఈ సీజన్‌లో గేల్ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదనే చెప్పాలి. పేలవంగా ఆడిన అతడు.. పంజాబ్ తరఫున 10 ఇన్నింగ్స్‌లలో 193 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్‌లో గేల్ అత్యధిక స్కోరు 46 మాత్రమే!. కాగా గేల్ ప్రకటనపై స్పందించిన పంజాబ్ కింగ్స్ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తూ.. ఈ వెస్టిండీస్ క్రికెటర్‌కు విషెస్ తెలిపింది.
చదవండి: IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్ చరిత్రలో అత్యధికం
Chris Gayle: వయసు మీద పడుతున్న సింహం లాంటివాడే.. కానీ
#PBKS respects and supports the decision of @henrygayle.
— Punjab Kings (@PunjabKingsIPL) September 30, 2021
Wishing him all the success for the upcoming #T20WorldCup!#SaddaPunjab #IPL2021 #PunjabKings https://t.co/QmTqhd8w6k
Comments
Please login to add a commentAdd a comment