
photo Courtesy: Punjab Kings Instagram
అహ్మదాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌లో రాణించిన పంజాబ్ కింగ్స్.. ఆపై బౌలింగ్‌లో మెరిసి ఆర్సీబీని కట్టడి చేసింది. ఆర్సీబీ కీలక ఆటగాళ్లను తొందరగా పెవిలియన్‌కు పంపడంలో సఫలమైన పంజాబ్ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇది పంజాబ్‌కు మూడో విజయం కాగా, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
ఆర్సీబీ-పంజాబ్‌ల మ్యాచ్ ముగిసిన తర్వాత క్రిస్ గేల్-యజ్రేంద్ర చహల్‌లు తమ వంటిపై ఉన్న జెర్సీలు విప్పేసి మరీ హంగామా చేశారు. పంజాబ్ కింగ్స్ ఆటగాడైన క్రిస్ గేల్-ఆర్సీబీ స్పిన్నర్ అయిన చహల్‌లు మంచి స్నేహితులు. అలానే వీరికి హడావుడి చేయడానికి ఏ అవకాశం వచ్చిన వదులుకోరు. నిన్నటి మ్యాచ్ ద్వారా మరొకసారి వీరిద్దరికీ ఒక అవకాశం దొరికింది. అంతే ఏం చేయాలో తెలియక తమ జెర్సీలను విప్పేసి మరీ వారి కండలను చూపించారు. యూనివర్శల్ బాస్ గేల్ తన కండలను బాడీ బిల్డర్‌లాగా చూపిస్తే ఫోజు కొడితే, ఆ పక్కనే ఉన్న చహల్ మాత్రం తన కండలను చూపించడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ పిక్‌ను పంజాబ్ కింగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక్కడ చదవండి: ‘కోహ్లి, ఏబీలకు నా ప్లాన్ అదే’
హర్‌ప్రీత్ బ్రార్ భుజం తట్టిన కోహ్లి.. నెటిజన్లు ఫిదా
అది ఇంకా బాధించేది: విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment