IPL: క్రిస్‌ గేల్‌ వచ్చేస్తున్నాడు..! | Chris Gayle To Play IPL 2023 | Sakshi
Sakshi News home page

IPL: క్రిస్‌ గేల్‌ వచ్చేస్తున్నాడు..!

Published Wed, Mar 30 2022 12:33 PM | Last Updated on Wed, Mar 30 2022 4:11 PM

Chris Gayle To Play IPL 2023 - Sakshi

Courtesy: IPL

IPL 2022: ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల వీరుడు, కరీబియన్‌ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. ఈ ఏడాది (2022) ఐపీఎల్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఫామ్‌ లేమి, వయో భారం రిత్యా అతను ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. అయితే, యూనివర్సల్ బాస్  తాజాగా ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్‌ను బట్టి చూస్తే అతను ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్ జస్ట్ స్టార్ట్.. లెట్స్ గో.. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టేశా.. అంటూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను గేల్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ చూసిన అతని అభిమానులు.. బాస్‌ విల్‌ బి బ్యాక్‌ అంటూ తెగ సంబురపడిపోతున్నారు. 


కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌లో గేల్‌తో పాటు మిస్టర్ 360 డిగ్రీస్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మెరుపులు లేకపోవడంతో అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. తాజాగా గేల్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ విషయంపై క్లూ ఇవ్వడంతో, ఏబీ అభిమానులు కూడా తమ ఫేవరెట్‌ క్రికెటర్‌ రీఎంట్రీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు ఏబీ తన ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గేల్‌ సైతం టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత అన్ని క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడన్న ప్రచారం జోరుగా సాగింది. యూనివర్సల్‌ బాస్‌.. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 142 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 4965 పరుగులు చేశాడు. ఇందులో 405 ఫోర్లు, 357 సిక్సర్లు ఉన్నాయి.


చదవండి: అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లినే టాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement