ENG vs WI: భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్‌ | England vs West Indies 2nd Test Day 3 | Sakshi
Sakshi News home page

ENG vs WI: భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్‌

Published Sun, Jul 21 2024 7:47 AM | Last Updated on Sun, Jul 21 2024 7:47 AM

England vs West Indies 2nd Test Day 3

ఇంగ్లండ్‌ 248/3 

వెస్టిండీస్‌తో రెండో టెస్టు 

నాటింగ్‌హామ్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ (78 బంతుల్లో 71 నాటౌట్‌; 8 ఫోర్లు), బెన్‌ డకెట్‌ (92 బంతుల్లో 76; 11 ఫోర్లు), ఒలీ పోప్‌ (67 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించగా...జో రూట్‌ (33 నాటౌట్‌) రాణించాడు.

 అంతకు ముందు వెస్టిండీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 351/5తో ఆట కొనసాగించిన విండీస్‌ 457 పరుగులకు ఆలౌటైంది. జోషువా డి సిల్వా (122 బంతుల్లో 82 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), షామర్‌ జోసెఫ్‌ (27 బంతుల్లో 33; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. వీరిద్దరు పదో వికెట్‌కు 78 బంతుల్లో 71 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 207 పరుగులు ముందంజలో ఉంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement