Eng Vs WI: తొలిటెస్దులోనే బౌలర్‌ సంచలనం.. ఇంగ్లండ్‌కు ఆధిక్యం | Eng Vs WI 1st Test: Gus Atkinson Helps England Dominate Day 1 | Sakshi
Sakshi News home page

Eng Vs WI: తొలిటెస్దులోనే బౌలర్‌ సంచలనం.. ఇంగ్లండ్‌కు ఆధిక్యం

Published Thu, Jul 11 2024 10:07 AM | Last Updated on Thu, Jul 11 2024 10:52 AM

Eng Vs WI 1st Test: Gus Atkinson Helps England Dominate Day 1

England vs West Indies, 1st Test Day 1: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. సొంతగడ్డపై సత్తా చాటుతూ బ్రాత్‌వైట్‌ బృందంపై పైచేయి సాధించింది.

మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు వెస్టిండీస్‌ ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య బుధవారం (జూలై 10) మొదటి మ్యాచ్‌ లండన్‌ వేదికగా ఆరంభమైంది.

లార్డ్స్‌ మైదానంలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆతిథ్య జట్టు పేసర్‌ గుస్‌ అట్కిన్‌సన్‌ 7 వికెట్లతో అదరగొట్టాడు.

ఈ క్రమంలో అట్కిన్‌సన్‌ (7/45) ధాటికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 41.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది.

మికైల్‌ లూయిస్‌ (27; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కావెమ్‌ హాడ్జ్‌ (24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), అథనాజ్‌ (23; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ అండర్సన్‌కు ఒక వికెట్‌ దక్కింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు సాధించింది. 68 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో జాక్‌ క్రాలీ (76; 14 ఫోర్లు), ఒలీ పోప్‌ (57; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. జో రూట్‌ (15 బ్యాటింగ్‌), హ్యారీ బ్రూక్‌ (25 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement