లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 10) మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా అరంగేట్రంలో ఇంగ్లండ్ తరఫున మూడో అత్యుత్తమ గణాంకాలను.. ఓవరాల్‌గా తొమ్మిదో అత్యుత్తమ గణాంకాలను (అరంగేట్రం) నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అట్కిన్సన్ ఓ ఓవర్‌లో నాలుగు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు.
అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. అట్కిన్సన్.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (6), కిర్క్ మెకెంజీ (1), అలిక్ అథనాజ్ (23), జేసన్ హోల్డర్ (0), జాషువ డసిల్వ (0), అల్జరీ జోసఫ్ (17), షమార్ జోసఫ్ (0) వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న జిమ్మీ ఆండర్సన్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు.
విండీస్ ఇన్నింగ్స్‌లో మిఖైల్ లూయిస్ అత్యధికంగా 27 పరుగులు చేయగా.. అలిక్ అథనాజ్ (23), కవెమ్ హాడ్జ్ (24) 20 పరుగుల మార్కును దాటారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆదిలోనే బెన్ డకెట్ (3) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత కుదురుగా ఆడుతుంది. 14 ఓవర్ల అనంతరం ఆ జట్టు వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. జాక్ క్రాలే (30), ఓలీ పోప్ (29) క్రీజ్‌లో ఉన్నారు.
డకెట్ వికెట్ జేడన్ సీల్స్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఇది తొలి టెస్ట్ మ్యాచ్. రెండో మ్యాచ్ జులై 18న, మూడో మ్యాచ్ జులై 26న మొదలుకానున్నాయి.
ఇంగ్లండ్ తరఫున అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు..
జాన్ ఫెర్రిస్-సౌతాఫ్రికాపై 7/37
డొమినిక్ కార్క్-వెస్టిండీస్‌పై 7/43
గస్ అట్కిన్సన్-వెస్టిండీస్‌పై 7/45
ఓవరాల్‌గా టెస్ట్ అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు
ఆల్బర్ట్ ట్రాట్-ఇంగ్లండ్‌పై 8/43
రాబర్ట్ మెస్సీ- ఇంగ్లండ్‌పై 8/53
నరేంద్ర హిర్వాని- వెస్టిండీస్‌పై 8/61
లాన్స్ క్లూసెనర్- ఇండియాపై 8/64
నరేంద్ర హిర్వాని- వెస్టిండీస్‌పై 8/75
రాబర్ట్ మెస్సీ- ఇంగ్లండ్‌పై 8/84
ఆల్ఫ్రెడ్ వాలెంటైన్- ఇంగ్లండ్‌పై 8/104
జేసన్ క్రేజా- ఇండియాపై 8/215
కైల్ అబాట్- పాకిస్తాన్‌పై 7/29
డొమినిక్ కార్క్- వెస్టిండీస్‌పై 7/43
గస్ అట్కిన్సన్-వెస్టిండీస్‌పై 7/45
Comments
Please login to add a commentAdd a comment