ఇంగ్లండ్‌ అలవోకగా.. | World Cup 2019 England Beat West Indies By 8 Wickets | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ అలవోకగా..

Jun 14 2019 9:55 PM | Updated on Jun 14 2019 10:22 PM

World Cup 2019 England Beat West Indies By 8 Wickets - Sakshi

సౌతాంప్టన్‌: అతిథ్య ఇంగ్లండ్‌ అలవోకగా విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 213 పరుగుల స్వల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 33.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. జేసన్‌ రాయ్‌కు గాయం కావడంతో ఓపెనర్‌గా వచ్చిన జోయ్‌ రూట్‌(100 నాటౌట్‌; 94 బంతుల్లో 11ఫోర్లు) సెంచరీతో అదరగొట్టాడు. రూట్‌కు తోడుగా బెయిర్‌ స్టో(45), క్రిస్‌ వోక్స్‌(40)లు రాణించడంతో ఆతిథ్య జుట్ట సునాయసంగా విజయాన్ని అందుకుంది. విండీస్‌ బౌలర్‌ గాబ్రియల్‌ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న జోయ్‌ రూట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన విండీస్‌ 44.4 ఓవర్లలో 212 పరుగులకే  చాపచుట్టేసింది. ఇంగ్లండ్‌ పేసర్లు మార్క్‌వుడ్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ వోక్స్‌లు తమ పదునైన బౌలింగ్‌తో విండీస్‌కు వణుకు పుట్టించారు. విండీస్‌ ఆటగాళ్లలో నికోలస్‌ పూరన్‌(63) హాఫ్‌ సెంచరీతో మెరవగా, క్రిస్‌ గేల్‌(36), హెట్‌మెయిర్‌(39)లు ఫర్వాలేదనిపించారు.  ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, జో రూట్‌ రెండు వికెట్లు తీశాడు. క్రిస్‌ వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌లకు చెరో వికెట్‌ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement