
సిడ్నీ: ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనలో వెస్టిండీస్ జట్టు మూడు టెస్టు సిరీస్‌లు ఆడతున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి నేపథ్యంలో బయో సెక్యూర్ పద్ధతిలో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్ తొలి టెస్టులో విండీస్ విజయం సాధించగా, రెండో టెస్టు మాత్రం ఆసక్తిని తలపిస్తోంది. కాగా, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడానికి ఆసీస్ సిద్ధమైంది. తాము మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి సీఏ ప్రపోజల్ పంపింది. బయో సెక్యూర్ పద్ధతిలో జరిగే ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తమ ప్రతిపాదనలో సీఏ పేర్కొంది. దీనిపై ఇప్పటికే ఈసీబీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. (బయో సెక్యూర్ క్రికెట్ సాధ్యమేనా?)
ఇదే జరిగితే సెప్టెంబర్ నెలలో ఇరు జట్ల మధ్య సిరీస్ జరుగనుంది. సెప్టెంబర్ 4-8 వరకూ టీ20లు, 10 నుంచి 15 వరకూ వన్డేలు నిర్వహించడానికి ఇరు బోర్డులు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం. సౌతాంప్టాన్, మాంచెస్టర్‌లోని వేదికలకు హోటళ్లు అనుసంధానం చేయడంతో మ్యాచ్‌లు బయో సెక్యూర్ పద్ధతిలో నిర్వహించడానికి ఈసీబీ సునాయమవుతోంది. ఇదే సూత్రాన్ని వెస్టిండీస్‌తో సిరీస్‌కు సైతం అవలంభిస్తోంది ఇంగ్లండ్. విండీస్‌తో తొలి టెస్టు సౌతాంప్టాన్‌లో జరగ్గా, రెండు, మూడు టెస్టులు మాంచెస్టర్ వేదిక కానుంది. ఇక గతవారం 26 మందితో కూడిన జట్టును సీఏ ఎంపిక చేయగా ఫైనల్ స్క్వాడ్‌ను ఎంపిక చేయడానికి సీఏ సెలక్టర్లు సన్నద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment