WI VS Eng: బ్రాత్‌వైట్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. రెండో టెస్టు కూడా.. | WI VS Eng: Krieg Brathwaite Incredible Innings 2nd Test Drawn | Sakshi
Sakshi News home page

WI VS Eng: బ్రాత్‌వైట్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. రెండో టెస్టు కూడా..

Published Mon, Mar 21 2022 10:54 AM | Last Updated on Mon, Mar 21 2022 2:41 PM

WI VS Eng: Krieg Brathwaite Incredible Innings 2nd Test Drawn - Sakshi

విండీస్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌​ బ్రాత్‌వైట్(PC: WC)

వెస్టిండీస్‌- ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. విండీస్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌​ బ్రాత్‌వైట్ మారథాన్‌ ఇన్నింగ్స్‌తో ఆతిథ్య జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది. కాగా బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా మార్చి 16న ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ అద్భుత సెంచరీల నేపథ్యంలో 9 వికెట్ల నష్టానికి 507 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 411 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇందుకు బదులుగా 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల వద్ద పర్యాటక ఇంగ్లండ​ తమ రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఈ క్రమంలో బ్రాత్‌వైట్‌ మారథాన్‌ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. 184 బంతులు ఎదుర్కొన్న అతడు 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 216 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సైతం డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. 

వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో టెస్టు స్కోర్లు:
ఇంగ్లండ్‌- 507/9 డిక్లేర్డ్‌ & 185/6 డిక్లేర్డ్‌
వెస్టిండీస్‌- 411 & 135/5

చదవండి: ఏడు వందల నిమిషాల మారథాన్‌ ఇన్నింగ్స్‌‌.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement