Brathwaite
-
WI VS Eng: బ్రాత్‌వైట్ అద్భుత ఇన్నింగ్స్.. రెండో టెస్టు కూడా..
వెస్టిండీస్- ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. విండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ మారథాన్ ఇన్నింగ్స్‌తో ఆతిథ్య జట్టు ఓటమి నుంచి గట్టెక్కింది. కాగా బ్రిడ్జ్‌టౌన్ వేదికగా మార్చి 16న ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ జో రూట్, బెన్ స్టోక్స్ అద్భుత సెంచరీల నేపథ్యంలో 9 వికెట్ల నష్టానికి 507 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 411 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల వద్ద పర్యాటక ఇంగ్లండ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్రాత్‌వైట్ మారథాన్ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి జట్టును ఓటమి నుంచి తప్పించాడు. 184 బంతులు ఎదుర్కొన్న అతడు 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 216 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సైతం డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు స్కోర్లు: ఇంగ్లండ్- 507/9 డిక్లేర్డ్ & 185/6 డిక్లేర్డ్ వెస్టిండీస్- 411 & 135/5 చదవండి: ఏడు వందల నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్.. Resilience and discipline! The WI Skipper takes the #MastercardPricelessMoment of the match! #WIvENG pic.twitter.com/YlNj8B43Il — Windies Cricket (@windiescricket) March 21, 2022 -
అయ్యో బ్రాత్‌వైట్.. రెండుసార్లు నువ్వేనా
మాంచెస్టర్ : ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో 500వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మంగళవారం ఐదో రోజు ఆటలో భాగంగా క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు. కాగా క్రికెట్ ప్రపంచంలో 500 వికెట్లు తీసిన 7వ బౌలర్‌గా నిలవడంతో పాటు ఈ రికార్డును సాధించిన ఫాస్ట్ బౌలర్లలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు జేమ్స్ అండర్సన్(589), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కౌట్నీ వాల్ష్( 519) వరుసగా ఉన్నారు. కాగా ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున 140 టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బ్రాడ్ నిలిచాడు. కాగా ఈ ఘనత సాధించిన ఇంగ్లీష్ మొదటి బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ నిలిచాడు. (ఆల్‌టైమ్ గ్రేట్‌లలో వారు కూడా..) అంతేగాక టెస్టుల్లో 500 వికెట్లు తీసిన ఇద్దరు ఆటగాళ్లు ఒకే జట్టులో ఒకే మ్యాచ్‌లో ఉండడం విశేషం. అంతేగాక యాదృశ్చికంగా జేమ్స్ అండర్సన్ 500వ వికెట్, బ్రాడ్ 500వ వికెట్‌గా విండీస్ బ్యాట్స్‌మెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ లభించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక బౌలర్ తన మైల్స్టోన్ వికెట్‌ను సాధించడంలో బ్రాత్‌వైట్ మూడు సార్లు బలయ్యాడు. లార్డ్స్ వేదికగా 2017లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అండర్సన్(500 వ) వికెట్, అదే ఏడాది సెడాన్పార్క్లో కివీస్‌తో జరిగిన టెస్టులో ట్రెంట్ బౌల్ట్( 200వ) వికెట్‌తో పాటు తాజాగా బ్రాడ్ తన 500వ వికెట్ మైలురాయిని బ్రాత్‌వైట్‌ను ఔట్ చేసి సాధించడం విశేషం. కాగా టెస్టుల్లో బౌలర్లు మైల్స్టోన్ అందుకోవడంలో అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ ఐదుసార్లు ఔటయ్యాడు. వారిలో వరుసగా అండర్సన్( 100వ), ఆండీ కాడిక్(100వ), షేన్ వార్న్ (300వ), జహీర్ ఖాన్(300వ), వాల్ష్( 500వ) కలిస్‌ను ఔట్ చేసి మైలురాళ్లను సాధించారు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ట్విటర్ వేదికగా బ్రాడ్‌ను ప్రశంసిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ ఘనత సాధించిన వారిలో బ్రాడ్ ఉండడం మాకు గర్వంగా ఉంది అంటూ క్యాప్షన్ జత చేసింది. ('నన్ను ఎందుకు పక్కనబెట్టారో అర్థం కాలేదు') An England great 🦁 A legend of the game 👑 So proud that @StuartBroad8 is one of ours! 🏴🏏 pic.twitter.com/W69G9CI9SR — England Cricket (@englandcricket) July 28, 2020 కాగా విండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో జట్టు మేనేజ్మెంట్ తనను పక్కన పెట్టడం పట్ల బ్రాడ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫామ్‌లో ఉన్న తనను కాదని వేరొకరికి అవకాశం ఇవ్వడం తనను బాధకు గురి చేసిందని బ్రాడ్ పేర్కొన్నాడు. అయితే రెండో టెస్టుకు జట్టులోకి వచ్చిన బ్రాడ్ తన సత్తాను చాటాడు. రెండో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఆరు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నిర్ణయాత్మకమైన మూడో టెస్టులో బ్రాడ్ మరింత రెచ్చిపోయాడు. మొదట బ్యాటింగ్ 45 బంతుల్లోనే 62 పరుగులు చేసి ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ నమోదు చేయగా.. బౌలింగ్‌లో 6 వికెట్లు తీసి 18వ సారి 5కంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు సాధించాడు. కాగా కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్రాడ్ రెండు వికెట్లు తీసి ఇప్పటికే 14 వికెట్లతో సిరీస్‌లో లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు.('భవిష్యత్తులో ధావన్‌కు అవకాశం కష్టమే') మరోవైపు కీలకమైన మూడో టెస్టులో 390 పరుగులు విజయలక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన విండీస్ ఓటమి అంచున నిలిచింది. ఇప్పటికే 82 పరుగులకే 6 వికెట్లు కోల్పయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే వరుణుడు అడ్డు తగలడంతో ఆటకు విరామం లభించింది. ఇంకా ఒక సెషన్ మిగిలే ఉండడంతో విండీస్ ఓటమి అంచుల్లో ఉంది. అయితే వర్షంతో చివరి సెషన్ తుడిచిపెట్టుకుపోతే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా విరామం తర్వాత జరుగుతున్న మొదటి టెస్టు సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకున్నాయి. -
విండీస్‌కు ఆధిక్యం
సౌతాంప్టన్: తొలి టెస్టు మూడోరోజూ వెస్టిండీస్‌దే పైచేయి. ఆతిథ్య ఇంగ్లండ్ బౌలర్లపై బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో విండీస్ ఆధిక్యంలో పడింది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (125 బంతుల్లో 65; 6 ఫోర్లు), వికెట్ కీపర్ డౌరిచ్ (115 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో 318 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 114 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ (4/49), అండర్సన్ (3/62) ప్రత్యర్థి భారీ ఆధిక్యానికి గండికొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. బర్న్స్ 10 పరుగులతో, సిబ్లీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 99 పరుగుల వెనుకంజలో ఉంది. బ్రాత్‌వైట్ అర్ధ శతకం... ఓవర్‌నైట్ స్కోరు 57/1తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన వెస్టిండీస్‌ను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ బ్రాత్‌వైట్, షై హోప్ బాధ్యతగా నడిపించారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టు స్కోరు వందకు చేరింది. దీనికి కాసేపటికే హోప్ (16; 1)ను డామ్ బెస్ ఔట్ చేసి ఇంగ్లండ్ శిబిరాన్ని ఊరడించాడు. రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక పట్టు బిగిద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశల్ని క్రీజులోకి వచ్చిన బ్రూక్స్ (39; 6 ఫోర్లు), చేజ్ (47; 6 ఫోర్లు) వమ్ము చేశారు. మొదట బ్రూక్స్ అండతో బ్రాత్‌వైట్ ఫిఫ్టీ పూర్తయింది. వీరి జోడీ సాఫీగా సాగుతున్న తరుణంలో బ్రాత్‌వైట్‌ను స్టోక్స్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే జట్టు స్కోరు 150కి చేరుకుంది. 159/3 స్కోరు వద్ద విండీస్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఆదుకున్న డౌరిచ్... అనంతరం వెస్టిండీస్ కాస్త తడబడింది. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయింది. బ్రూక్స్‌ను అండర్సన్... బ్లాక్‌వుడ్ (12; 2 ఫోర్లు)ను బెస్ ఔట్ చేశారు. అయితే చేజ్‌కు వికెట్ కీపర్ డౌరిచ్ జతయ్యాక ఇన్నింగ్స్ మళ్లీ గాడిన పడింది. ఇద్దరు ఆరో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. చేజ్ నిష్క్రమించగా... డౌరిచ్ టెయిలెండర్ల అండతో అర్ధసెంచరీ సాధించాడు. జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. కాసేపటికే ఇంగ్లండ్ సారథి స్టోక్స్... జోసెఫ్ (18; 3 ఫోర్లు)తో పాటు డౌరిచ్నూ ఔట్ చేయడంతో ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతోసేపు పట్టలేదు. గాబ్రియెల్ (4)ను మార్క్ వుడ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో విండీస్ ఆలౌటైంది. మూడో రోజు కూడా అంపైరింగ్ పేలవంగా ఉంది. లెక్కకు మిక్కిలి తప్పుడు నిర్ణయాలతో విసుగు తెప్పించారు. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 204 ఆలౌట్ వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 318 ఆలౌట్ (బ్రాత్‌వైట్ 65, డౌరిచ్ 61, చేజ్ 47; స్టోక్స్ 4/49, అండర్సన్ 3/62); ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 15/0 (బర్న్స్ 10 బ్యాటింగ్, సిబ్లీ 5 బ్యాటింగ్). -
విండీస్ సంచలనం
రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై 5 వికెట్లతో గెలుపు లీడ్స్: షాయ్ హోప్ (211 బంతుల్లో 118 నాటౌట్; 14 ఫోర్లు) పేరుకు తగ్గట్టుగానే వెస్టిండీస్ జట్టుకు ఆశాకిరణమయ్యాడు. 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు తను వరుసగా రెండో శతకం బాది చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 5/0 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 91.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 322 పరుగులు చేసి నెగ్గింది. 2000 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై విండీస్ టెస్టు విజయాన్ని అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ బ్రాత్‌వైట్ (180 బంతుల్లో 95; 12 ఫోర్లు) కొద్దిలో మరో శతకాన్ని కోల్పోయాడు. బ్లాక్‌వుడ్ (45 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. మొయిన్ అలీకి రెండు వికెట్లు దక్కాయి. -
ఇంతకంటే ఘోరమైన స్థితిలో ఆడాం!
రెండో మ్యాచ్ రద్దుపై ధోని వ్యాఖ్య లాడర్‌హిల్ (ఫ్లోరిడా): సిరీస్ సమం చేసే అవకాశం ముందుండగా, వర్షం కారణంగా రెండో టి20 మ్యాచ్ రద్దు కావడం భారత కెప్టెన్ ధోనిని అసహనానికి గురి చేసింది. ఆట కొనసాగించి ఉండాల్సిందని అతను అభిప్రాయ పడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో ముందుగా విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ మాట్లాడుతూ ‘పెవిలియన్‌నుంచి చూస్తే రెండు మూడు చోట్ల మైదానం ప్రమాదకరంగా కనిపించింది. ముఖ్యంగా రనప్ ఏరియా వద్ద పరుగెత్తి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అవుట్‌ఫీల్డ్‌లో కూడా బంతి కోసం పరుగెత్తి ఆటగాడు జారి పడితే అతని కెరీర్ ముగిసిపోవచ్చు. అంపైర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు‘ అని అన్నాడు. అయితే దీనితో ధోని విభేదించాడు. ‘పదేళ్లుగా ఇంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో కూడా మైదానంలోకి దిగి మ్యాచ్‌లు ఆడాం. 2011 ఇంగ్లండ్ సిరీస్ అయితే మొత్తం వర్షంలోనే సాగింది. అయినా నీళ్లు నిలిచిన ప్రాంతం రనప్ ఏరియాకు చాలా దూరం ఉంది. మరీ అంత దూరంనుంచి పరుగెత్తుకు రావడానికి వారి జట్టులో షోయబ్ అక్తర్ లేడు. కాబట్టి అదేమీ పెద్ద సమస్య కాదు. కాకపోతే అంపైర్ల నిర్ణయాన్ని గౌరవించాల్సి వచ్చింది‘ అని అతను వ్యాఖ్యానించాడు. మరో వైపు రాబోయే రోజుల్లో సొంతగడ్డపైనే వరుసగా 13 టెస్టులు ఆడనున్న భారత జట్టు నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంటుందని ధోని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
'శామ్యూల్స్ ను ఒత్తిడిలోకి నెట్టాలనుకోలేదు'
కోల్‌కతా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు వరల్డ్ టీ 20 ట్రోఫీని సాధించడంలో కార్లోస్ బ్రాత్ వైట్ పాత్ర మరువలేనిది. చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు చేయాల్సిన తరుణంలో 4 వరుస సిక్సర్లు బాది ఇంకా రెండు బంతులుండగానే జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే తాను హార్డ్ హిట్టింగ్ చేయడానికి ముందుగానే సిద్దమైనట్లు బ్రాత్ వైట్ తాజాగా వెల్లడించాడు. అది ఆఖరి ఓవర్ కావడంతో ఆ సమయంలో మార్లోన్ శామ్యూల్స్ ఒత్తిడిలోకి నెట్టకుండా తానే రిస్క్ తీసుకుని హిట్టింగ్ చేసినట్లు తెలిపాడు. '20 ఓవర్‌కు ముందు నేను-శామ్యూల్స్ మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా బంతుల్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాం. తొలి బంతిని కనీసం హిట్ చేస్తే పరుగు తీస్తానని శామ్యూల్స్ చెప్పాడు. అయితే ఆ క్లిష్ట సమయంలో సింగిల్స్ తీసి మార్లోన్కు స్ట్రైకింగ్ ఇవ్వదలుచుకోలేదు. శామ్యూల్స్ కు స్ట్రైకింగ్ ఇచ్చి అతన్ని ఒత్తిడిలోకి నెట్టాలనుకోలేదు. నేనే క్రీజ్‌లో ఉండి చావో రేవో తేల్చుకోవాలనుకున్నా. బంతిని క్షణ్ణంగా పరిశీలించి బలంగా బాదాలనుకున్నా. మొదటి మూడు సిక్సర్లు కొట్టిన సమయంలో మా విజయానికి ఒక పరుగు మాత్రమే అవసరమనే విషయం నాకు తెలుసు. అయినప్పటికీ ఆ మరుసటి బంతిని బౌండరీ దాటిస్తేనే మేలనుకున్నా. ఆ సమయంలో ఎవరైనా రనౌట్ అయితే మ్యాచ్ చేజారిపోయి ప్రమాదం ఉందనే అలా చేశా. అదృష్టం కొద్దీ నా వ్యూహం ఫలించింది' అని బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు. -
బ్రాత్‌వైట్ వాజ్ బ్రీత్‌టేకింగ్: సచిన్
టి-20 ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్‌ను క్రికెటర్లు, మాజీలు, అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఆదివారం రాత్రి ఇంగ్లండ్‌పై కరీబియన్లు చరిత్రాత్మక విజయం సాధించాక సోషల్ మీడియాలో అభినందలు వెల్లువెత్తాయి. వెస్టిండీస్ అన్ని విధాలా నిజమైన చాంపియన్స్ అని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. అండర్-19, మహిళలు, పురుషుల విభాగాల్లో కరీబియన్లు విశ్వవిజేతలుగా నిలవడం అద్భుతమని ప్రశంసించాడు. బ్రాత్‌వైట్ వాజ్ బ్రీత్‌టేకింగ్ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. నిన్న రాత్రి విండీస్ గెలవగానే జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ సంబరాలు చేసుకున్నాడు. బోల్ట్ చొక్కా విప్పి డాన్స్ చేశాడు. విండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ట్విటర్లో అభినందలు తెలిపింది. WI all the way!! True champions, be it u19s, women's or men's championship! Super stuff by team WI! Brathwaite was breathtaking! #WT20Final — sachin tendulkar (@sachin_rt) 3 April 2016