రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై 5 వికెట్లతో గెలుపు
లీడ్స్: షాయ్ హోప్ (211 బంతుల్లో 118 నాటౌట్; 14 ఫోర్లు) పేరుకు తగ్గట్టుగానే వెస్టిండీస్ జట్టుకు ఆశాకిరణమయ్యాడు. 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు తను వరుసగా రెండో శతకం బాది చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 5/0 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 91.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 322 పరుగులు చేసి నెగ్గింది. 2000 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై విండీస్ టెస్టు విజయాన్ని అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ బ్రాత్‌వైట్ (180 బంతుల్లో 95; 12 ఫోర్లు) కొద్దిలో మరో శతకాన్ని కోల్పోయాడు. బ్లాక్‌వుడ్ (45 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. మొయిన్ అలీకి రెండు వికెట్లు దక్కాయి.
విండీస్ సంచలనం
Published Wed, Aug 30 2017 1:21 AM | Last Updated on Tue, Sep 12 2017 1:17 AM
Advertisement
Advertisement