బ్రాత్వైట్ వాజ్ బ్రీత్టేకింగ్: సచిన్ | Brathwaite was breathtaking, sachin tendulkar tweets | Sakshi
Sakshi News home page

బ్రాత్వైట్ వాజ్ బ్రీత్టేకింగ్: సచిన్

Published Mon, Apr 4 2016 8:33 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

బ్రాత్వైట్ వాజ్ బ్రీత్టేకింగ్: సచిన్

బ్రాత్వైట్ వాజ్ బ్రీత్టేకింగ్: సచిన్

టి-20 ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ను క్రికెటర్లు, మాజీలు, అభిమానులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఆదివారం రాత్రి ఇంగ్లండ్పై కరీబియన్లు చరిత్రాత్మక విజయం సాధించాక సోషల్ మీడియాలో అభినందలు వెల్లువెత్తాయి. వెస్టిండీస్ అన్ని విధాలా నిజమైన చాంపియన్స్ అని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. అండర్-19, మహిళలు, పురుషుల విభాగాల్లో కరీబియన్లు విశ్వవిజేతలుగా నిలవడం అద్భుతమని ప్రశంసించాడు. బ్రాత్వైట్ వాజ్ బ్రీత్టేకింగ్ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.  

నిన్న రాత్రి విండీస్ గెలవగానే జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ సంబరాలు చేసుకున్నాడు. బోల్ట్ చొక్కా విప్పి డాన్స్ చేశాడు. విండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ట్విటర్లో అభినందలు తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement