వెస్టిండీస్ గడ్డపై ఇంగ్లండ్‌కు మరో పరాభావం ఎదురైంది. గ్రెనడా వేదికగా విండీస్‌తో జరిగిన రెండో టీ20లో 10 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో బట్లర్ సేన వెనకంజలో ఉంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది.
ఇంగ్లీష్ జట్టు బ్యాటర్లలో సామ్ కుర్రాన్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక కరేబియన్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 3వికెట్లతో అదరగొట్టగా.. అకేల్ హోసేన్ రెండు, హొల్డర్, మోటీ తలా వికెట్ పడగొట్టారు.
బ్రాండెన్ కింగ్ విధ్వంసం..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ బ్రాండెన్ కింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ పావెల్(28 బంతుల్లో 52) అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్, మిల్స్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వోక్స్, కుర్రాన్, అహ్మద్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 డిసెంబర్ 16న గ్రెనిడా వేదికగానే జరగనుంది. అయితే టీ20ల్లో అద్బుత రికార్డు ఉన్న ఇంగ్లండ్ ఈ తరహా ప్రదర్శన కనబరుస్తుండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం మూడో టీ20లో అయినా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా ఇప్పటికే విండీస్‌తో వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment