వన్డే వరల్డ్‌కప్-2023లో దారుణ ప్రదర్శన ప్రదర్శనతో ఇంటుముఖం పట్టిన ఇంగ్లండ్.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ కరేబియన్ టూర్‌లో భాగంగా ఆతిథ్య విండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడనుంది. ఈ సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డే సిరీస్‌కు స్టార్ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్, రూట్, మొయిన్ అలీలకు ఇంగ్లండ్ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
యువ పేసర్లు జోస్ టాంగ్వే, జాన్ టర్నర్‌కు తొలిసారి ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టులో చోటు దక్కింది. అదే ఈ రెండు సిరీస్‌లలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా జోస్ బట్లర్ వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్-2023లో విఫలమకావడంతో బట్లర్‌ను ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు వినిపించాయి.
కానీ ఇంగ్లండ్ సెలక్షన్ కమిటీ మాత్రం యథావిధిగా జోస్‌నే తమ సారథిగా కొనసాగించింది. డిసెంబర్ 3న ఆంటిగ్వా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఇంగ్లండ్ జట్టు కరేబియన్ టూర్ ప్రారంభం కానుంది.
విండీస్‌తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జాక్ క్రాలే, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆలీ పోప్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, జాన్ టర్నర్.
విండీస్‌తో టీ20లకు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్, క్రిస్ వోక్స్
చదవండి: World Cup 2023: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్.. వర్షం పడితే పరిస్థితి ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment