Jason Holder
T20 World Cup 2021- Jason Holder as a replacement for Obed McCoy: వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. కాలి గాయం కారణంగా బౌలర్ ఒబెడ్ మెకాయ్ టోర్నీకి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న హోల్డర్‌ను ప్రధాన జట్టులోకి అనుమతిస్తూ టెక్నికల్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు.. ‘‘కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో వివిధ జట్లు ఎక్స్‌ట్రా ప్లేయర్లతో ప్రయాణాలు చేస్తున్నాయి. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న రిజర్వు ప్లేయర్ హోల్డర్‌ను ప్రధాన జట్టులోకి అనుమతిస్తున్నాం’’ అని వెల్లడించింది.
27 టీ20లు ఆడిన అనుభవం
విండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 27 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో భాగంగా 201 పరుగులు చేయడంతో పాటుగా... 22 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వెస్టిండీస్ తరఫున 51 టెస్టులు, 121 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో 137, వన్డే క్రికెట్‌లో 140 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు.
వరుస పరాజయాలతో విలవిల
టీ20 వరల్డ్‌కప్-2021లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగిన వెస్టిండీస్‌కు ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయి. సూపర్-12 రౌండ్‌లో భాగంగా తొలుత ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడి.. చెత్త రికార్డు మూటగట్టుకున్న పొలార్డ్ బృందం... దక్షిణాఫ్రికా చేతిలోనూ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడి.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అక్టోబరు 29న బంగ్లాదేశ్‌తో వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.
చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్ చరిత్రలో క్రేజీ ఓవర్ అంటున్న ఫ్యాన్స్!
T20 World Cup: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అతడు టోర్నీ నుంచి అవుట్!
Comments
Please login to add a commentAdd a comment