West Indies Jason Holder Reveals About His Favourite Actor And Indian Dish, Deets Inside - Sakshi
Sakshi News home page

Jason Holder: షారుఖ్‌ అంటే పిచ్చి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన విండీస్ స్టార్‌ ఆల్‌రౌండర్‌

Mar 12 2022 5:05 PM | Updated on Mar 12 2022 7:20 PM

Jason Holder Reveals His Favourite Bollywood Actor And Indian Dish - Sakshi

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెస్టిండీస్ స్టార్‌ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు బాలీవుడ్ నటుడు షారుఖ్‌ ఖాన్‌ అంటే పిచ్చి అని, కింగ్‌ ఖాన్‌కు తాను వీరాభిమానినని, చాలామంది విండీస్ క్రికెటర్లలాగే తనకు కూడా భారత్ అంటే వల్లమాలిన అభిమానమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ ద్వారా చాలామంది విండీస్ ఆటగాళ్లు భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల మక్కువ పెంచుకున్నారని, వారిలో తాను కూడా ఒకడినని తెలిపాడు. 


టీమిండియా స్టార్‌ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా తమ దేశ ఆటగాళ్లను కూడా భారతీయులు అమితంగా అభిమానిస్తారని.. క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, పొలార్డ్ లాంటి విండీస్‌ ఆటగాళ్ల విషయంలో ఇది రుజువైందని పేర్కొన్నాడు. ఫ్యాన్‌ కోడ్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో హోల్డర్‌ భారత్‌తో తనకున్న అనుబంధాన్ని షేర్‌ చేసుకుంటూ, తన అభిరుచులు, ఇష్టమైన భారతీయ వంటకాలపై కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన భారతీయ వంటం బెండకాయ ఫ్రై (భిండి ఫ్రై) అని చెప్పుకొచ్చాడు. 

ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలంలో జేసన్ హోల్డర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రూ.8.75 కోట్ల భారీ మొత్తానికి ఎల్‌ఎస్‌జీ హోల్డర్‌ను కొనుగోలు చేసింది. హోల్డర్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల తరఫున ఆడాడు. మార్చి 28న వాంఖడే వేదికగా ఎల్‌ఎస్‌జీ, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేయనున్నాయి.
చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్‌.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement