ట్రినిడాడ్: టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో తమ బ్యాటింగ్ విభాగం ఆకట్టుకున్నప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు కారణంగానే ఓటమి చెందామని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ పేర్కొన్నాడు. ప్రధానంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను తమ వికెట్ కీపర్ షాయ్ హోప్ ఆరంభంలోనే వదిలేయడంతో అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నాడు. భారత్ ఛేజింగ్‌లో భాగంగా కీమో పాల్ వేసిన ఆరో ఓవర్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను హోప్ జారవిడిచాడు. ఆపై చెలరేగిన కోహ్లి శతకంతో మెరిశాడు.
‘ మా బ్యాటింగ్ విభాగం ఆకట్టుకోవడంతో గౌరవప్రదమైన స్కోరును భారత్ ముందుంచాం. కానీ బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కోహ్లి 11 పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడం మాకు ప్రతికూలంగా మారింది. ఇటీవల కాలంలో ఫీల్డింగ్ తప్పిదాలు చేయడమే మాకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది’ అని హోల్డర్ తెలిపాడు. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment