హోల్డర్‌ డబుల్‌ సెంచరీ | Double Century Was Never in My Thoughts - WI Skipper Jason Holder | Sakshi
Sakshi News home page

హోల్డర్‌ డబుల్‌ సెంచరీ

Published Sun, Jan 27 2019 1:52 AM | Last Updated on Sun, Jan 27 2019 1:52 AM

 Double Century Was Never in My Thoughts - WI Skipper Jason Holder - Sakshi

బ్రిడ్జ్‌టౌన్‌: సొంత మైదానంలో కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ (229 బంతుల్లో 202 నాటౌట్‌; 23 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ డబుల్‌ సెంచరీకి తోడు వికెట్‌ కీపర్‌ షేన్‌ డౌరిచ్‌ (224 బంతుల్లో 116 నాటౌట్‌; 11 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ బాదడంతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్‌... ఇంగ్లండ్‌కు అసాధ్యమైన 628 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని ఛేదించే క్రమంలో నాలుగో రోజు శనివారం ఇంగ్లండ్‌ టీ విరామానికి 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.

ఓపెనర్లు రోరీ బర్న్స్‌ (84), జెన్నింగ్స్‌ (14), బెయిర్‌ స్టో (30), కెప్టెన్‌ జో రూట్‌ (15) ఔటయ్యారు. ఆ జట్టు ఇంకా 411 పరుగులు చేయాల్సి ఉంది. మరోవైపు శుక్రవారం విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను 415/6 వద్ద డిక్లేర్‌ చేసింది. హోల్డర్, డౌరిచ్‌ ఏడో వికెట్‌కు అభేద్యంగా 295 పరుగులు జోడించడం విశేషం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement