
టీమిండియాతో సోమవారం ఆలస్యంగా జరిగిన రెండో టి20 వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా తొలి టీ20 జరిగిన ట్రినిడాడ్ నుంచి ఇరు జట్ల లగేజీ సెయింట్ కిట్స్‌కి చేరడంలో జాప్యం చోటు చేసుకోవడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు విండీస్ క్రికెట్ తెలిపింది.
"అనివార్య పరిస్ధితుల కారణంగా ట్రినిడాడ్ నుంచి సెయింట్ కిట్స్‌కి రావల్సిన ఇరు జట్ల లగేజీ ఆలస్యంగా వచ్చింది. దీంతో భారత్-విండీస్ మధ్య జరగాల్సిన రెండో టీ20 రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలు)కు ప్రారంభమవుతుంది. అభిమానులు, స్పాన్సర్‌లు, ప్రసార భాగస్వాములుకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాం" అని క్రికెట్ వెస్టిండీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో విజయం సాధించిన భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
చదవండి: Rashid Latif: "పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు భారత్ చేస్తోంది.. అది మంచిది కాదు "
*CWI STATEMENT* Delayed start time for 2nd Goldmedal T20I Cup match, powered by Kent Water Purifiers | New Start Time: 12:30PM AST (11:30am Jamaica/10pm India)https://t.co/q1J5FBdZAh https://t.co/dy59uajSr8
— Windies Cricket (@windiescricket) August 1, 2022
Comments
Please login to add a commentAdd a comment