గేల్ పరుగుల తుఫాన్కు బ్రేక్
కింగ్స్టన్: వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పరుగుల తుఫానుకు మూడు నెలలు బ్రేక్ పడనుంది. గేల్ వెన్నునొప్పి కారణంగా మూడు నెలల పాటు క్రికెట్కు దూరంకానున్నాడు. గేల్ శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.
'వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకుంటున్నా. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. రెండు మూడు నెలలు క్రికెట్కు దూరంగా ఉంటా. డిసెంబర్లో మళ్లీ వస్తాను' అని క్రిస్ గేల్ చెప్పాడు. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరపున ఆడుతున్న గేల్ పరుగుల తుఫాన్తో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్తో పాటు ఇతర టి-20 లీగ్ల్లోనూ గేల్ రాణించాడు.