
నరైన్ బౌలింగ్ సందేహాస్పదం
వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని ఐసీసీ ప్రకటించింది. శ్రీలంకతో పల్లెకెలెలో జరిగిన వన్డే తర్వాత అంపైర్లు ఫిర్యాదు చేయడంతో 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని ఆదేశించింది.
ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ సందర్భంగా నరైన్ శైలి సందేహాస్పదంగా ఉందని గతంలో తేల్చినా... ఐసీసీ నరైన్ విషయంలో తొలిసారి పరీక్షకు ఆదేశించింది. ఫలితం వచ్చేవరకూ అతను వెస్టిండీస్ తరఫున ఆడొచ్చని ఐసీసీ తెలిపింది.