న్యూఢిల్లీ: ఎప్పుడూ క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతొ నిత్యం వార్తల్లో ఉండే భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్, తాజాగా ఐపీఎల్ 2020లో (సెప్టెంబర్ 19) ఓ బౌలర్ ప్రమాదకరంగా మారనున్నట్లు తెలిపారు. శనివారం గంభీర్ ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ ఈ నెల 19నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020లో వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరెన్‌తో బ్యాట్స్‌మెన్లకు ఇబ్బందులు తప్పవని అభిప్రాపడ్డాడు. నరెన్ తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్సమెన్లకు చుక్కలు చూపనున్నాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020లో సునీల్ నరెన్ కేకేఆర్ తరుపున ఆడునున్నాడు. కాగా సునీల్ నరైన్ బౌలింగ్ రన్‌టైమ్‌లో అతని వ్యూహాన్ని బ్యాట్స్‌మెన్ పసిగట్టడం అంత ఈజీ కాదని తెలిపాడు.
అయితే యూఏఈ వికెట్లపై సునీల్ నరైన్ గ్రిప్ దొరికిందంటే చాలు అతను దూసుకెళ్తాడని పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ పేస్‌తో బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బంది పెడితే, సునీల్ నరైన్ అన్యూహ్య బంతులతో బ్యాట్సమెన్‌కు సవాలు విసురుతాడని గౌతం గంభీర్ పేర్కొన్నాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ గంభీర్ కెప్టెన్సీలో రెండు ఐపీఎల్(2012, 2014) టైటిళ్లను గెలుపొందిన విషయం తెలిసిందే. (చదవండి: ‘బౌన్సర్లతో బెంబేలెత్తించా’)
Comments
Please login to add a commentAdd a comment