ఐపీఎల్-2024లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోతుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్రవారం వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ నిరాశపరిచాడు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హిట్‌మ్యన్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్రంగా కష్టపడ్డాడు.ఈ క్రమంలో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా ఐపీఎల్‌లో నరైన్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ కావడం ఇది ఎనిమిదో సారి.
దీంతో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ స్పిన్నర్ అమిత్ మిశ్రా చేతిలో కూడా 7 సార్లు ఔటయ్యాడు.
రోహిత్ పాటు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, రిషబ్ పంత్, రహానే కూడా 7 సార్లు ఒకే బౌలర్ చేతిలో ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment