7 Overs, 7 Maidens, 7 Wickets: Sunil Narine turns on beast mode ahead of IPL 2023 - Sakshi
Sakshi News home page

Sunil Narine: సునీల్‌ నరైన్‌ సంచలనం.. 7 ఓవర్లు.. 7 మెయిడెన్లు.. 7 వికెట్లు

Published Mon, Mar 20 2023 4:31 PM | Last Updated on Mon, Mar 20 2023 4:59 PM

7 Overs, 7 Maidens, 7 Wickets: Sunil Narine Turns On Beast Mode Ahead Of IPL 2023 - Sakshi

File photo

ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు వెస్టిండీస్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌, కేకేఆర్‌ స్టార్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ట్రినిడాడ్ అండ్‌ టొబాగో క్రికెట్ బోర్డ్ ప్రీమియర్‌షిప్ డివిజన్ I మ్యాచ్‌లో నరైన్‌ సంచలన ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్ Iకు నరైన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం పోర్ట్-ఆఫ్-స్పెయిన్‌ వేదికగా  క్లార్క్ రోడ్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్‌.. కనీసం ఒక్క పరుగు ఇవ్వకుండా 7 వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్‌ చేసిన నరైన్‌ 7 మెయిడన్లతో 7 వికెట్లు పడగొట్టాడు.

నరైన అద్భుత ప్రదర్శన కారణంగా ప్రత్యర్ధి జట్టు కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన లో క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. ఇక ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సునీల్‌ నరైన్‌.. 31 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు ఐదు వికెట్ల హాల్స్‌ ఉన్నాయి.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. సూర్యకుమార్ వద్దు! అతడే సరైనోడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement