వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం(నవంబర్ 5) సోషల్ మీడియా వేదికగా నరైన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 35 ఏళ్ల నరైన్.. తన కెరీర్లో అంతర్జాతీయంగా 65 వన్డే, 51 టీ20, 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 165 వికెట్లు పడగొట్టాడు.
2012 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన వెస్టిండీస్ జట్టులో నరైన్ భాగంగా ఉన్నాడు. నరైన్ చివరగా విండీస్ తరపున 2019లో ఆడాడు. అప్పటినుంచి జట్టుకు సునీల్ దూరంగా ఉన్నాడు. అదే విధంగా నరైన్ తన చివరి టెస్టు 2013లో ఆడగా.. వన్డే మ్యాచ్ 2016లో ఆడాడు. నరైన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికినప్పటికీ.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగనున్నాడు.
"వెస్టిండీస్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని తెలియజేస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన క్రికెట్ వెస్టిండీస్, కోచింగ్ సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు" అని నరైన్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నరైన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. బర్త్‌డే రోజునే! అదొక కల: విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment