
దుబాయ్: కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున అటు ఓపెనర్‌గానూ, ఇటు ప్రధాన స్పిన్నర్‌గాను కీలక పాత్ర పోషిస్తున్న సునీల్ నరైన్‌పై ఆ జట్టు మెంటార్ డేవిడ్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. కేకేఆర్‌కు నరైన్ కీలక ఆటగాడంటూ కొనియాడాడు. అసలు నరైన తమ జట్టులో ఉండటం అదృష్టమన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ బౌలింగ్ చేసే బౌలర్ అన్నాడు. ప్రత్యేకంగా వరల్డ్ టీ20 బౌలర్లలో నరైన్ ఒకడన్నాడు. ‘ నరైన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తాడు. (చదవండి: ఐపీఎల్.. బలాబలాలు తేల్చుకుందాం!)
బౌలింగ్‌లో స్పిన్ మ్యాజిక్‌తో కీలక వికెట్లు సాధిస్తూ మంచి బ్రేక్ ఇస్తూ ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎక్కడైనా బ్రేక్ ఇవ్వడంలో నరైన్‌ది ప్రత్యేక స్థానం. కేకేఆర్ జట్టులో నరైన్ ఉండటం మా అదృష్టం.జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉంటే కెప్టెన్ డీకే(దినేశ్ కార్తీక్)కు వెంటనే గుర్తుచ్చొ బౌలర్ నరైన్. ఈసారి ఐపీఎల్‌లో కూడా నరైన్‌దే కీలక పాత్ర. హోరాహోరీ పోరులో నరైన్‌దే పైచేయి అవడం యం.యూఏఈలో స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం నరైన్‌కు కలిసొచ్చే అంశం’ అని హస్సీ తెలిపాడు.
కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ నరైన్. 119 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు సాధించాడు. గతేడాది ఐపీఎల్‌లో నరైన్ 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో 166.27తో 143 పరుగులు సాధించాడు.ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. గౌతం గంభీర్ సారథ్యంలో కేకేఆర్ 2012, 2014ల్లో టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఆ తర్వాత 2016, 17, 18ల్లో ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్‌ను మాత్రంసాధించలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment