
అదే టర్నింగ్ పాయింట్: గంభీర్
సునీల్ నరైన్‌ను ఇక ఓపెనర్‌గా పంపబోమని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.
మొహాలి: సునీల్ నరైన్‌ను ఇక ఓపెనర్‌గా పంపబోమని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. తర్వాతి మ్యాచ్‌లో క్రిస్ లిన్‌తో కలిసి తాను ఓపెనింగ్‌కు దిగుతానని వెల్లడించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడింది. పవర్ ప్లేలో ఎక్కువ డాట్ బాల్స్ ఆడడంతో మూల్యం చెల్లించుకున్నామని మ్యాచ్ ముగిసిన తర్వాత గంభీర్ తెలిపాడు.
‘ఆరంభంలో చాలా బాగా ఆడాం. ఆరు ఓవర్ల తర్వాత నేను, రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే ఎక్కువ డాట్స్ బాల్స్ ఆడడం మాకు ప్రతికూలంగా మారింది. ఒకే ఓవర్లో రాహుల్ తెవటియా రెండు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. నేను, ఉతప్ప ఒకే అవుట్ కావడం టర్నింగ్ పాయింట్. సులువుగా పరుగులు సాధించే అవకాశాన్ని పంజాబ్ బౌలర్లు మాకు ఇవ్వలేద’ని గంభీర్ పేర్కొన్నాడు. శనివారం జరిగే తన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గంభీర్ సేన తలపడనుంది.