IPL 2023: Sunil Narine 150th Match-KKR Most Matches for Single IPL Franchise - Sakshi
Sakshi News home page

Sunil Narine: మ్యాచ్‌ ప్రారంభానికి ముందే సునీల్‌ నరైన్‌ రికార్డు

Published Thu, Apr 6 2023 7:59 PM | Last Updated on Thu, Apr 6 2023 8:43 PM

Sunil Narine 150 Th Match-KKR Most Matches For Single IPL franchise - Sakshi

Photo: IPL Website

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కేకేఆర్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ గురువారం ఆర్‌సీబీతో మ్యాచ్‌తో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌ నరైన్‌కు 150వది కావడం విశేషం. ఈ క్రమంలోనే నరైన్‌ ఐపీఎల్‌లో సింగిల్‌ ఫ్రాంచైజీ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో చేరిపోయాడు.

ఇక ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి(225 మ్యాచ్‌లు-ఆర్‌సీబీ) టాప్‌లో కొనసాగుతుండగా.. సీఎస్‌కే తరపున 206 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పొలార్డ్‌(189 మ్యాచ్‌లు- ముంబై ఇండియన్స్‌) మూడో స్తానంలో.. సురేశ్‌ రైనా(176 మ్యాచ్‌లు- సీఎస్‌కే), ఏబీ డివిలియర్స్‌( 156 మ్యాచ్‌- ఆర్‌సీబీ) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 

ఇక ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఓవర్సీస్‌ ఆటగాళ్ల జాబితాలో నరైన్‌ చోటు సంపాదించాడు. 189 - కీరన్ పొలార్డ్ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్-164 మ్యాచ్‌లు,  సునీల్ నరైన్- 150* మ్యాచ్‌లు, షేన్ వాట్సన్-145 మ్యాచ్‌లు ఉన్నారు. ఇక మరో కేకేఆర్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌కు ఇది వందో ఐపీఎల్‌ మ్యాచ్‌ కావడం విశేషం.

చదవండి: 'నమ్మకంతో రిటైన్‌ చేసుకున్నారు.. తిరిగిచ్చేయాలి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement