Most matches
-
మ్యాచ్ ప్రారంభానికి ముందే సునీల్ నరైన్ రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌తో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ నరైన్‌కు 150వది కావడం విశేషం. ఈ క్రమంలోనే నరైన్ ఐపీఎల్లో సింగిల్ ఫ్రాంచైజీ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో చేరిపోయాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లి(225 మ్యాచ్‌లు-ఆర్సీబీ) టాప్‌లో కొనసాగుతుండగా.. సీఎస్కే తరపున 206 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పొలార్డ్(189 మ్యాచ్‌లు- ముంబై ఇండియన్స్) మూడో స్తానంలో.. సురేశ్ రైనా(176 మ్యాచ్‌లు- సీఎస్కే), ఏబీ డివిలియర్స్( 156 మ్యాచ్- ఆర్సీబీ) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఓవర్సీస్ ఆటగాళ్ల జాబితాలో నరైన్ చోటు సంపాదించాడు. 189 - కీరన్ పొలార్డ్ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్-164 మ్యాచ్‌లు, సునీల్ నరైన్- 150* మ్యాచ్‌లు, షేన్ వాట్సన్-145 మ్యాచ్‌లు ఉన్నారు. ఇక మరో కేకేఆర్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌కు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. చదవండి: 'నమ్మకంతో రిటైన్ చేసుకున్నారు.. తిరిగిచ్చేయాలి' -
బుందేలా కొత్త చరిత్ర
కెరీర్లో 137వ రంజీ మ్యాచ్ ఆడనున్న మధ్యప్రదేశ్ కెప్టెన్ తెరమరుగు కానున్న మజుందార్ రికార్డు ముంబై: మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ దేవేంద్ర బుందేలా రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించబోతున్నాడు. నేడు (మంగళవారం) బరోడాతో జరిగే మ్యాచ్ తనకు 137వది. 83 ఏళ్ల రంజీ చరిత్రలో ఏ ఆటగాడు కూడా ఇన్ని మ్యాచ్‌లు ఆడింది లేదు. ఇప్పటిదాకా అమోల్ మజుందార్ (136 మ్యాచ్‌లు) పేరిట ఈ ఘనత ఉంది. మరో రెండు నెలల్లో 40 ఏళ్ల పడిలోకి అడుగుపెట్టబోతున్న ఈ సీనియర్ ఆటగాడు 19 ఏళ్ల వయస్సులో తొలిసారిగా 1995-96 రంజీ కెరీర్‌ను ఆరంభించాడు. అతడితో ఆడిన ఆటగాళ్లంతా ఇప్పటికే రిటైర్మెంట్ తీసుకుని కోచ్‌లు, అంపైర్లు, వ్యాఖ్యాతలుగా స్థిరపడ్డారు. ఆట పట్ల అంకితభావం, క్రమశిక్షణ వల్లే ఇంత దూరం రాగలిగానని బుందేలా తెలిపాడు. సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీ సమకాలికునిగా క్రికెట్ ఆడడం మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు. ‘క్రికెట్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేని ఉజ్జరుుని నుంచి అకుంఠిత దీక్షతో జట్టు కెప్టెన్ స్థారుుకి ఎదిగాను. ఎన్నో సవాళ్లు నన్ను రాటుదేల్చారుు. మరికొంత కాలం క్రికెట్లో కొనసాగుతాను’ అని బుందేలా చెప్పాడు.