
నరైన్ కొత్త యాక్షన్
వెస్టిండీస్ మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన్ కొత్త యాక్షన్‌తో కనిపించబోతున్నాడు. కొన్ని బంతులు వేసే సమయంలో నిబంధనలకు మించి మోచేయిని వంచుతున్నందున ప్రస్తుతం ఐసీసీ నుంచి అతను నిషేధం ఎదుర్కొంటున్నాడు. అయితే మార్చిలో భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్ కోసం నరైన్‌ను వెస్టిండీస్ జట్టులోకి ఎంపిక చేశారు. ఈ టోర్నీకి ముందే ఐసీసీ పరీక్షకు అతను హాజరవుతున్నాడు. నరైన్ యాక్షన్ బాగుందని, ఐసీసీ నుంచి క్లీన్‌చిట్ వస్తుందని విండీస్ బోర్డు భావిస్తోంది.