నరైన్ బౌలింగ్ పై అందరి దృష్టి | Sunil Narine is widely expected to hold the key to Knight Riders | Sakshi
Sakshi News home page

నరైన్ బౌలింగ్ పై అందరి దృష్టి

Published Wed, Apr 8 2015 7:43 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

నరైన్ బౌలింగ్ పై అందరి దృష్టి

నరైన్ బౌలింగ్ పై అందరి దృష్టి

కోల్ కతా: ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో అందరి దృష్టి సునీల్ నరైన్ పైనే ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న అతడు ఎలా బౌలింగ్ చేస్తాడనే దానిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తన బౌలింగ్ యాక్షను సరిదిద్దుకున్న తర్వాత అతడు తొలిసారిగా ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాడు.

కోల్ కతా విజయాల్లో కీలకపాత్ర పోషించిన నరైన్ సందేహాస్పద బౌలింగ్ శైలి నుంచి ఐసీసీ విముక్తి కల్పించినా బీసీసీఐ పరీక్ష ఎదుర్కొన్నాడు. చెన్నైలో రామచంద్ర మెడికల్ కళాశాలలోని బయోమెకానికల్ సెంటర్‌లో బౌలింగ్ టెస్ట్ లో పాల్గొన్నాడు. బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో ముంబై ఇండియన్స్ తో ఆరంభ మ్యాచ్ లో ఆడుతున్నాడు.

మారిన బౌలింగ్ యాక్షన్ బరిలోకి దిగిన నరైన్ మునుపటి ఫామ్ కొనసాగిస్తాడా, లేదా అనేది నేటి మ్యాచ్ లో తేలనుంది. నరైన్ తో పాటు రసెల్, మోర్కల్, షకీబ్.. కోల్ కతా టీమ్ లోని ఇతర విదేశీ ఆటగాళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement