కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ గురువారం చెన్నైలో బౌలింగ్ పరీక్ష పూర్తి చేసుకున్నాడు.
చెన్నై: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ గురువారం చెన్నైలో బౌలింగ్ పరీక్ష పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ నుంచి క్లియరెన్స్ వచ్చినా... బీసీసీఐ నిర్వహించే పరీక్ష పాస్ కావలసిందేననే నిబంధన ఉండటంతో... కేకేఆర్ జట్టు తనని హడావుడిగా పిలిపించింది. గురువారం ఉదయం చెన్నై చేరిన నరైన్ రామచంద్ర మెడికల్ కళాశాలలోని బయోమెకానికల్ సెంటర్‌లో బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత కోల్‌కతా వెళ్లాడు. ఈ పరీక్ష ఫలితం ఎప్పుడు వచ్చేది అధికారులు వెల్లడించలేదు.