జార్జ్టౌన్: ముక్కోణపు సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కీరోన్ పొలార్డ్, సునీల్ నరైన్లను ఆ దేశ క్రికెట్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ ప్రశంసలతో ముంచెత్తాడు. తమ జట్టుకు సునీల్, పొలార్డ్ లిద్దరూ మూల స్తంభాలు వంటి వారని కొనియాడాడు.ఈ మ్యాచ్లో దకిణాఫ్రికా ఫేవరెట్ అయినా, వారికి గెలుపును దూరం చేయడంలో సునీల్, పొలార్డ్లు ముఖ్యభూమిక పోషించారన్నాడు.
నిషేధం కారణంగా ఏడు నెలల పాటు క్రికెట్ కు దూరమైన నరైన్ తన పునరాగమనంలోనే సత్తా చాటుకోవడం అభినందనీయమన్నాడు. ఇలా కొంతకాలం క్రికెట్ కు దూరంగా తిరిగి రాణించడం అసాధారణ విషయమని సిమ్మన్స్ పేర్కొన్నాడు. మరోవైపు పొలార్డ్కు దాదాపు రెండు సంవత్సరాల తరువాత తొలి వన్డే ఆడి తనను తాను నిరూపించుకోవడం వెస్టిండీస్ కు శుభసూచకమన్నాడు.