Chip Shortage Still Record Level Business In 2021: చిప్ కొరత.. ఇది ఒక్క కంపెనీ సమస్య కాదు. మొత్తం గ్లోబల్ ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య వల్లే ప్రొడక్టివిటీ బాగా తగ్గింది. పైగా టెస్లా లాంటి తోపు కంపెనీలు తాము కొత్త మోడల్స్‌ను తేలేకపోతున్నామంటూ ప్రకటనలు సైతం ఇచ్చుకుంటోంది. మరి అంత పెద్ద సమస్య.. ఊహకందని రేంజ్‌లో బిజినెస్ చేసిందంటే నమ్ముతారా?..
చిప్ కొరత(సెమీ కండక్లర్ల కొరత).. గత ఏడాది కాలంగా సెల్‌ఫోన్, ఆటోమొబైల్స్ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పదం. దీనిని వంకగా చూపిస్తూనే వాహనాలు, మొబైల్స్ రేట్లు నేలకు దిగడం లేదు. పైగా పోను పోనూ మరింత పెంచుకుంటూ పోతున్నాయి కంపెనీలు. ఈ తరుణంలో కిందటి ఏడాది సెమీకండక్టర్ సెక్టార్ చేసిన బిజినెస్ ఎంతో తెలుసా? అక్షరాల 583.5 బిలియన్ డాలర్లు.
అవును.. సెమీకండక్టర్ సెక్టార్‌లో ఒక ఏడాదిలో ఇన్నేళ్లలో ఈ రేంజ్‌లో భారీ బిజినెస్.. అదీ 500 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడం ఇదే ఫస్ట్‌టైం. ఈ మేరకు సోమవారం వెలువడిన గార్ట్‌నర్ నివేదిక సెమీకండక్టర్ బిజినెస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
► 2018 నుంచి శాంసంగ్-ఇంటెల్ మధ్య చిప్ బిజినెస్‌లో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో.. మూడేళ్ల తర్వాత శాంసంగ్ ఇంటెల్‌కు రాజేసి మొదటి పొజిషన్‌ను ఆక్రమించుకుంది. ఓవరాల్ మార్కెట్‌లో ఒక్కసారిగా 34.2 శాతం రెవెన్యూను శాంసంగ్ పెంచుకోవడం గమనార్హం.
► ఇంటెల్‌కు కేవలం 0.5 శాతం పెంచుకుని.. టాప్ 25 కంపెనీల్లో అతితక్కువ గ్రోత్ రేట్ సాధించిన కంపెనీగా పేలవమైన ప్రదర్శన కనబరిచింది.
► 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నప్పటికీ.. సెమీకండక్టర్ సప్లయ్ చెయిన్ కొరత.. ప్రత్యేకించి ఆటోమోటివ్ పరిశ్రమలో వీటి కొరత స్పష్టంగా కనిపించింది.
► ఫలితంగా బలమైన డిమాండ్, లాజిస్టిక్స్, ముడిసరుకు ధరల కలయిక సెమీకండక్టర్ల సగటు అమ్మకపు ధరను (ASP) ఒక్కసారిగా పెంచేసిందని, చిప్ కొరత-స్ట్రాంగ్ డిమాండ్ 2021లో మొత్తం ఆదాయ వృద్ధికి దోహదపడిందని గార్ట్‌నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ నార్వుడ్ చెప్తున్నారు.
► రిమోట్ వర్కింగ్, లెర్నింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చడానికి హైపర్‌స్కేల్ క్లౌడ్ ప్రొవైడర్‌ల ద్వారా పెరిగిన సర్వర్ డిప్లాయ్‌మెంట్‌ల కారణంగా, అలాగే PCలు, అల్ట్రా మొబైల్స్ కోసం ఎండ్-మార్కెట్ డిమాండ్ పెరగడం వల్ల ‘మెమరీ’ మళ్లీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది.
► 2020లో ఆదాయం కంటే 42.1 బిలియన్లు డాలర్లు పెరగ్గా.., ఇది 2021లో మొత్తం సెమీకండక్టర్ మొత్తం ఆదాయ వృద్ధిలో 33.8 శాతం కావడం కొసమెరుపు.
► మెమరీతో పాటు డ్రామ్(DRAM) కూడా 2021 ఆదాయం పెరగడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 40.4 శాతం రాబడి వృద్ధితో.. 2021లో 92.5 బిలియన్ డాలర్ల ఆదాయం తీసుకొచ్చింది. సర్వర్స్, పీసీల నుంచి బలమైన డిమాండ్ కారణంగా డ్రామ్ డబుల్ డిజిట్‌కు చేరుకోగలిగింది.
► 2021లో 555 మిలియన్ల యూనిట్ల 5జీ స్మార్ట్‌ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. 2020లో ఇది కేవలం 250 మిలియన్ యూనిట్లుగా మాత్రమే ఉంది. ఈ లెక్కన 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా సెమీకండక్టర్ రెవెన్యూ గణనీయంగా పెరగడానికి కారణమైంది.
► హవాయ్ మీద అమెరికా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమైంది. చైనా యేతర కంపెనీలకు కాసుల పంట పండించింది. హువాయ్ చిప్ సబ్సిడరీ.. 2020లో 8.2 బిలియన్ డాలర్ల బిజినెస్ చేయగా.. 2021లో కేవలం ఒక బిలియన్‌డాలర్ల బిజినెస్ చేయడం గమనార్హం.
చదవండి: లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్ ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment