Chip Shortage
-
రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో సెమీకండక్టర్ రంగంలో 2026 నాటికి దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు అవసరమవుతారని నివేదికలు వెలువడుతున్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్బీ సర్వీసెస్ నివేదిక ఈమేరకు వివరాలు వెల్లడించింది. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌లో మూడు లక్షల ఉద్యోగాలు, చిప్ ఏటీఎంపీ (అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్)లో రెండు లక్షల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో మరిన్ని కొలువులు సృష్టించబడుతాయని ఎన్ఎల్బీ నివేదించింది.నివేదికలోని వివరాల ప్రకారం.. దేశంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌లకు పెద్ద ఎత్తున అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా దాదాపు రూ. 32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఉత్తరప్రదేశ్‌లో ఆమోదం లభించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలో ప్రత్యేకంగా సెమీకండక్టర్ పాలసీను తీసుకురావాలని యోచిస్తోంది. గుజరాత్‌లోని ధొలేరా ప్రాంతంలో టాటా ఎలక్ట్రానిక్స్-పీఎస్ఎంసీ చిప్ ప్రాజెక్ట్, అస్సాంలో టాటా అసెంబ్లింగ్, టెస్ట్ యూనిట్‌ను నిర్వహిస్తోంది. సీజీ పవర్, కేన్స్, అదానీ వంటి ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అమెరికాకు చెందిన మైక్రోటెక్ సంస్థ గుజరాత్లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం లభించింది.రూ.166 లక్షల కోట్లు ఖర్చుఎలక్ట్రానిక్ భాగాలు, తయారీ, సేవలకు సంబంధించి ఈ రంగంలో గ్లోబల్‌గా దాదాపు రెండు ట్రిలియన్ డాలర్లు(రూ.166 లక్షల కోట్లు) ఖర్చు చేయబోతున్నట్లు ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ ప్లాట్‌ఫామ్ లుమినోవో వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సెబాస్టియన్ స్కాల్ అంచనా వేశారు. సెమీకండక్టర్ పరిశ్రమలో ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్, సెమీకండక్టర్ వేఫర్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ స్పెషలిస్ట్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ (పీఎం) టెక్నీషియన్, డిజైన్ ఇంజినీర్, ప్రాసెస్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ వంటి కీలక పోస్టుల కోసం మానవ వనరుల అవసరం ఉందని చెప్పారు.ఇదీ చదవండి: నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!ఏటా ఐదు లక్షల మందిఎన్ఎల్బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ మాట్లాడుతూ..‘ఈ రంగంలో మానవ వనరుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయాల్సి ఉంది. భారతదేశం సెమీకండక్టర్ హబ్‌గా మారాలంటే 2026 నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం. కాబట్టి ఈ రంగంలో ఉపాధి కొరతను తీర్చాలంటే ఏటా ఐదు లక్షల మంది ప్రతిభావంతులను తయారు చేయాల్సి ఉంటుంది’ అన్నారు. -
‘ప్రపంచ డిమాండ్‌ను తీర్చే భారత్’
భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సెమీకండక్టర్ల డిమాండ్‌ను భారత్ తీరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ విభాగంలో భారత్‌లో పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో జరిగిన ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.‘సమీప భవిష్యత్తులో భారత కంపెనీలకు సెమీకండక్టర్ల కొరత తీరనుంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వీటికి ఏర్పడే డిమాండ్ భర్తీ చేసే సత్తా భారత్‌కు ఉంది. విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలి. ఈ రంగంలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇన్ని విధాలా సహకరిస్తుంది. దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీ విభాగంలో దాదాపు 85,000 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఆర్ అండ్ డీ నిపుణులు పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిప్‌ల తయారీకి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నాం. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పెరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువవుతుంది’ అని ప్రధాని మోదీ తెలిపారు.సెమీకండక్టర్ తయారీలో దేశాన్ని గ్లోబల్ హబ్‌గా మర్చే లక్ష్యంతో ‘సెమీకాన్ ఇండియా 2024’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్‌ను 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారి ఆవిష్కరణల గురించి తెలియజేస్తారు. దాంతో స్థానికంగా చిప్‌ల తయారీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సదస్సులో 250 మందికి పైగా వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని అంచనా.భారత సెమీకండక్టర్ మార్కెట్ ప్రస్తుతం సుమారు 23.2 బిలియన్ డాలర్ల(రూ.1.93 లక్షల కోట్లు) విలువను కలిగి ఉంది. 2028 నాటికి ఇది దాదాపు రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ విభాగం 17.10% వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఇన్వెస్ట్ ఇండియా సంస్థ నివేదించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) రెండో దశలో భాగంగా సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దాంతోపాటు కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, సిలికాన్ ఫోటోనిక్స్‌లో ప్రత్యేకత కలిగిన మరిన్ని కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్‌కు చుక్కెదురు!దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సెమీకండక్టర్లకు గిరాకీ ఏర్పడింది. స్థానికంగా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు సెమీకండక్టర్ల దిగుమతిపై ఆధారపడుతున్నాయి. అందుకు భిన్నంగా స్థానికంగా వీటిని అభివృద్ధి చేసి వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను డిసెంబర్ 2021లో ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా ఔట్సోర్స్డ్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్(ఓఎస్ఏటీ)తోపాటు అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏపీఎంపీ) కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించింది. మరికొన్ని నెలల్లో ఈ కంపెనీలు సెమీకండక్టర్ల ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐదు కంపెనీలకు వీటి తయారీ కోసం కేంద్రం అనుమతులు జారీ చేసింది. అందులో టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ఫ్యాబ్, మైక్రాన్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సీజీ పవర్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, కేన్స్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీలున్నాయి. -
వాహన అమ్మకాలు రికార్డ్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశీ వాహన రంగ దుమ్మురేపింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక అమ్మకాలను సాధించాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 2022–23లో ఎగుమతులు, దేశీయంగా కలిపి మొత్తం 19,66,164 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది (2021–22)లో 16,52,653 యూనిట్లతో పోలిస్తే సేల్స్ 19 శాతం పెరిగాయి. హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు సైతం 18 శాతం ఎగబాకి 7,20,565 యూనిట్లుగా నమోదయ్యాయి. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఒక ఏడాదిలో సాధించిన అత్యధిక విక్రయాలు ఇవేనని హ్యుందాయ్ మోటార్ ఇండియా పేర్కొంది. టాటా మోటార్స్ దేశీయంగా గతేడాది 5,38,640 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 45 శాతం వృద్ధి చెందాయి. పరిశ్రమవ్యాప్తంగా... చిప్ కొరత కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం పడుతున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో తాము అత్యధిక విక్రయాలను సాధించామని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహన పరిశ్రమ అమ్మకాలు 27 శాతం వృద్ధి చెంది 38.89 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపారు. 2021–22లో సేల్స్ 30.62 లక్షలు. రిటైల్‌గా, మొత్తం విక్రయాల పరంగా చూసినా గతేడాది పరిశ్రమ అత్యధిక అమ్మకాలను నమోదు చేసిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40–41 లక్షల అమ్మకాలను అంచనా వేస్తున్నామన్నారు. మార్చిలో చూస్తే... మారుతీ సుజుకీ మార్చి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా సేల్స్ 3 శాతం తగ్గి 1,39,952 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ విక్రయాలు మాత్రం 13 శాతం ఎగబాకాయి. టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 3 శాతం పెరిగాయి. ద్విచక్రవాహన సంస్థలు హీరోమోటో, హోండా, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ మెరుగైన విక్రయాలను నమోదు చేశాయి. -
‘ఆటో’కు తీరని చిప్ చిక్కులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వాహనాల పరిశ్రమకు మొదలైన సెమీ కండక్టర్ల కష్టాలు ఇంకా పూర్తిగా తీరలేదు. గతంతో పోలిస్తే తీవ్రత కొంత తగ్గినా ఇప్పటికీ చిప్‌ల కొరత వెన్నాడుతూనే ఉంది. దీంతో ఆర్డర్లు పుష్కలంగా ఉన్నా ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకోలేకపోతున్నాయి. ఫలితంగా పెండింగ్ ఆర్డర్లు పేరుకుపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీలు దాదాపుగా ఇవే విషయాలను ప్రస్తావించాయి. రెండో త్రైమాసికంతో పోలి స్తే మూడో క్వార్టర్లో పరికరాల సరఫరాపరమైన సమస్య స్వల్పంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) పేర్కొంది. క్యూ3లో దా దాపు 46,000 వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఉత్పత్తి ప్రణాళికలు వేసుకోవడం సవాలుగా మారిందని ఎంఎస్ఐఎల్ వివరించింది. దీనితో మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,63,000 వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని.. వీటిలో 1,19,000 ఆర్డర్లు ఇటీవల ప్రవేశపెట్టిన మోడల్స్వే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అదే పరిస్థితిలో మరిన్ని సంస్థలు .. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం తెలంగాణ, మహారాష్ట్రలో దాదాపు రూ. 11,000 కోట్లతో పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినప్పటికీ ప్రస్తుతమున్న ప్లాంట్ల సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలే ఇందుకు కారణమని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ వెల్లడించారు. స్కార్పియో, ఎక్స్‌యూవీ700 వంటి వాహనాల తయారీలో దాదాపు 200 రకాల సెమీకండక్టర్ చిప్స్ అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంఅండ్ఎం వద్ద 2,66,000 వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి. ఇక చిప్లపరమైన సవాళ్లు 2023లో కూడా కొనసాగవచ్చని జేఎల్ఆర్ పేర్కొంది. చిప్‌ల సరఫరాను మెరుగుపర్చుకునే దిశ గా మంచి పురోగతే సాధించామని .. అయినప్పటికీ కొన్ని సవాళ్లు నెలకొన్నాయని తెలిపింది. చైనాలో మళ్లీ కోవిడ్ ప్రబలడం, మార్కెట్లో అధిక రేట్లకు చిప్‌లు కొనాల్సి వస్తుండటం తదితర సవాళ్లు ఉన్న ట్లు వివరించింది. 2023లో డిమాండ్ సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నామని అయితే వాహనాలను ఎంత మేరకు అందించగలమనేది చిప్‌ల సరఫరా అంశమే నిర్దేశిస్తుందని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఎండీ పియుష్ ఆరోరా తెలిపారు. -
చిప్ కార్డు సంస్థల కుమ్మక్కు.. విచారణకు ఐబీఏ డిమాండ్!
న్యూఢిల్లీ: బ్యాంకులకు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను సరఫరా చేసే సంస్థలు కుమ్మక్కైన అవకాశాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది. చిప్‌ల కొరత పేరుతో వివిధ వెండర్లు కార్డుల రేట్లను పెంచేస్తున్నట్లు, పెంపు పరిమాణం దాదాపు ఒకే రకంగా ఉంటున్నట్లు తమకు పలు ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఇదంతా చూస్తుంటే వెండర్లు కుమ్మక్కయ్యే ఇలా చేస్తుండవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ సీసీఐకి లేఖ రాయడంతో పాటు అటు ఆర్థిక శాఖకు కూడా ఐబీఏ విషయాన్ని తెలియజేసింది. సీనియర్ బ్యాంకు అధికారి వివరణ ప్రకారం.. గతేడాది 4–5 కార్డు సంస్థలు చిప్‌ల కొరత వల్ల ధరలు పెంచాల్సి వస్తోందంటూ బ్యాంకులను సంప్రదించాయి. అప్పట్లో ఒక్కో కార్డు ధరను రూ. 35 నుంచి రూ. 42కి పెంచేందుకు బ్యాంకులు అంగీకరించాయి. అయితే, అవే వెండర్ సంస్థలు మూడు నెలల క్రితం మళ్లీ రేట్లు పెరిగాయంటూ బ్యాంకులను సంప్రదించాయి. దీంతో కార్డులు లేకుంటే వ్యాపారం దెబ్బతింటుందనే భయంతో ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకు రూ. 10 మేర పెంచేందుకు అంగీకరించిందని అధికారి తెలిపారు. గత కొద్ది నెలలుగా కార్డులకు డిమాండ్ పెరుగుతుండటంతో బ్యాంకులే పెరిగిన రేటు భారాన్ని మోస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై ఆఖరు నాటి 92.81 కోట్ల డెబిట్ కార్డులు, 8 కోట్ల పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏప్రిల్ మొదలైన ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 20 లక్షల పైచిలుకు కార్డులు జారీ అయ్యాయి. -
న్యూఇయర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలే, పడిపోయిన ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు!
కొత్త సంవత్సరం ఆటోమొబైల్ సంస్థలకు ఏమాత్రం కలిసిరాలేదంటూ కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. న్యూఇయర్ సెంటి మెంట్ కారణంగా ఆయా ప్రొడక్ట్ ల సేల్స్ భారీ ఎత్తున జరుగుతాయి. కానీ ఆటోమొబైల్ రంగంలో అందుకు భిన్నంగా సేల్స్ జరిగినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికల్లో పేర్కొన్నాయి. గతేడాదికంటే ఈఏడాది ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు పడిపోవడం అందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్యాసింజర్ వెహికల్స్ పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్‌డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది.ముఖ్యంగా సెమీ కండక్టర్ల కొరతతో పాటు కోవిడ్ కేసులు పెరిగిపోవడం, ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు జోరందుకోవడం వంటి అంశాలు కొనుగోలు దారులపై పడినట్లు ఎఫ్ఏడీఏ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 10.12 శాతం తగ్గాయి. 2021తో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రిటైల్ విక్రయాలు 2,87,424 నుంచి 2,58,329 యూనిట్లకు వచ్చి చేరాయి. సెమికండక్టర్ల కొరత ఇందుకు కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్‌డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహన విక్రయాలు 13.44 శాతం తగ్గి 10,17,785 యూనిట్లుగా ఉంది. -
సెమీకండక్టర్ల కొరత.. భారీగా పడిపోయిన కార్ల అమ్మకాలు!
సెమీకండక్టర్ల కొరత కారణంగా కార్ల తయారీ కంపెనీలు డిసెంబర్ 2021 నాటికి 7 లక్షల కార్లను సమయానికి అందించలేక పోయినట్లు నేడు కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే 2021-22 తెలిపింది. సరఫరాలో ఆలస్యం కారణంగా 2021లో వాహన డెలివరీ సగటు సమయం(ఆర్డర్ తేదీ నుంచి డెలివరీ చేయడానికి గల మధ్య అంతరం) సుమారు 14 వారాలుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ ఎకనామిక్ సర్వే 2021-22లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసింది. 2021 డిసెంబరులో కార్ల తయారీదారులు దేశీయ మార్కెట్లో 2,19,421 ప్యాసింజర్ వాహనాలను విక్రయించారని, ఇది 2020తో పోలిస్తే అమ్మకాలు 13% తగ్గిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సీఐఏఎమ్) నివేదించింది. దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఎకనామిక్ సర్వే తెలిపింది. సెమీకండక్టర్, డిస్ ప్లే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.76,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెమీకండక్టర్ల కొరతకు కారణమవుతున్న సమయంలో ఈ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ జోక్యం చేసుకోవాల్సి వచ్చినట్లు సర్వే తెలిపింది. సరఫరా గొలుసుల్లో విచ్ఛిన్నం కారణంగా అనేక విభిన్న పరిశ్రమలకు చెందిన కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం లేదా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక తెలిపింది. (చదవండి: దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!) -
ఒకపక్క దిగ్గజాల ఏడుపు.. మరోపక్క ఎన్నడూ లేనంతగా కాసుల వర్షం!
Chip Shortage Still Record Level Business In 2021: చిప్ కొరత.. ఇది ఒక్క కంపెనీ సమస్య కాదు. మొత్తం గ్లోబల్ ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య వల్లే ప్రొడక్టివిటీ బాగా తగ్గింది. పైగా టెస్లా లాంటి తోపు కంపెనీలు తాము కొత్త మోడల్స్‌ను తేలేకపోతున్నామంటూ ప్రకటనలు సైతం ఇచ్చుకుంటోంది. మరి అంత పెద్ద సమస్య.. ఊహకందని రేంజ్లో బిజినెస్ చేసిందంటే నమ్ముతారా?.. చిప్ కొరత(సెమీ కండక్లర్ల కొరత).. గత ఏడాది కాలంగా సెల్‌ఫోన్, ఆటోమొబైల్స్ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పదం. దీనిని వంకగా చూపిస్తూనే వాహనాలు, మొబైల్స్ రేట్లు నేలకు దిగడం లేదు. పైగా పోను పోనూ మరింత పెంచుకుంటూ పోతున్నాయి కంపెనీలు. ఈ తరుణంలో కిందటి ఏడాది సెమీకండక్టర్ సెక్టార్ చేసిన బిజినెస్ ఎంతో తెలుసా? అక్షరాల 583.5 బిలియన్ డాలర్లు. అవును.. సెమీకండక్టర్ సెక్టార్లో ఒక ఏడాదిలో ఇన్నేళ్లలో ఈ రేంజ్లో భారీ బిజినెస్.. అదీ 500 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడం ఇదే ఫస్ట్‌టైం. ఈ మేరకు సోమవారం వెలువడిన గార్ట్నర్ నివేదిక సెమీకండక్టర్ బిజినెస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ► 2018 నుంచి శాంసంగ్-ఇంటెల్ మధ్య చిప్ బిజినెస్‌లో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో.. మూడేళ్ల తర్వాత శాంసంగ్ ఇంటెల్‌కు రాజేసి మొదటి పొజిషన్‌ను ఆక్రమించుకుంది. ఓవరాల్ మార్కెట్లో ఒక్కసారిగా 34.2 శాతం రెవెన్యూను శాంసంగ్ పెంచుకోవడం గమనార్హం. ► ఇంటెల్‌కు కేవలం 0.5 శాతం పెంచుకుని.. టాప్ 25 కంపెనీల్లో అతితక్కువ గ్రోత్ రేట్ సాధించిన కంపెనీగా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ► 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నప్పటికీ.. సెమీకండక్టర్ సప్లయ్ చెయిన్ కొరత.. ప్రత్యేకించి ఆటోమోటివ్ పరిశ్రమలో వీటి కొరత స్పష్టంగా కనిపించింది. ► ఫలితంగా బలమైన డిమాండ్, లాజిస్టిక్స్, ముడిసరుకు ధరల కలయిక సెమీకండక్టర్ల సగటు అమ్మకపు ధరను (ASP) ఒక్కసారిగా పెంచేసిందని, చిప్ కొరత-స్ట్రాంగ్ డిమాండ్ 2021లో మొత్తం ఆదాయ వృద్ధికి దోహదపడిందని గార్ట్నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ నార్వుడ్ చెప్తున్నారు. ► రిమోట్ వర్కింగ్, లెర్నింగ్, ఎంటర్టైన్మెంట్ అవసరాలను తీర్చడానికి హైపర్‌స్కేల్ క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా పెరిగిన సర్వర్ డిప్లాయ్‌మెంట్‌ల కారణంగా, అలాగే PCలు, అల్ట్రా మొబైల్స్ కోసం ఎండ్-మార్కెట్ డిమాండ్ పెరగడం వల్ల ‘మెమరీ’ మళ్లీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది. ► 2020లో ఆదాయం కంటే 42.1 బిలియన్లు డాలర్లు పెరగ్గా.., ఇది 2021లో మొత్తం సెమీకండక్టర్ మొత్తం ఆదాయ వృద్ధిలో 33.8 శాతం కావడం కొసమెరుపు. ► మెమరీతో పాటు డ్రామ్(DRAM) కూడా 2021 ఆదాయం పెరగడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 40.4 శాతం రాబడి వృద్ధితో.. 2021లో 92.5 బిలియన్ డాలర్ల ఆదాయం తీసుకొచ్చింది. సర్వర్స్, పీసీల నుంచి బలమైన డిమాండ్ కారణంగా డ్రామ్ డబుల్ డిజిట్‌కు చేరుకోగలిగింది. ► 2021లో 555 మిలియన్ల యూనిట్ల 5జీ స్మార్ట్ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. 2020లో ఇది కేవలం 250 మిలియన్ యూనిట్లుగా మాత్రమే ఉంది. ఈ లెక్కన 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా సెమీకండక్టర్ రెవెన్యూ గణనీయంగా పెరగడానికి కారణమైంది. ► హవాయ్ మీద అమెరికా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమైంది. చైనా యేతర కంపెనీలకు కాసుల పంట పండించింది. హువాయ్ చిప్ సబ్సిడరీ.. 2020లో 8.2 బిలియన్ డాలర్ల బిజినెస్ చేయగా.. 2021లో కేవలం ఒక బిలియన్డాలర్ల బిజినెస్ చేయడం గమనార్హం. చదవండి: లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్ ఏంటంటే..